పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇటీవలి కాలంలో వరుస బ్లాక్ బస్టర్ విజయాలతో ఆయన కెరీర్ అద్భుతంగా సాగిపోతోంది. సలార్, కల్కి చిత్రాలు పాన్ ఇండియా లెవెల్లో సూపర్ హిట్ అయ్యాయి. త్వరలో రాజాసాబ్ చిత్రంతో ప్రేక్షకులను మరోసారి పలకరించనున్నాడు. ఈ నేపథ్యంలో డార్లింగ్ అభిమానులకు శుభవార్త అందింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అదేంటంటే..? ప్రభాస్ అక్టోబర్ 23న జన్మదినం జరుపుకోనున్నాడు. దీనిని పురస్కరించుకుని ఆయన అభిమానులు తమ హీరో పుట్టినరోజు వేడుకలకు భారీగా ఏర్పాట్లు చేస్తు్న్నారు. మరోవైపు ప్రభాస్ నటించిన పలు హిట్ సినిమాలు రీ-రిలీజ్ కాబోతున్నాయి. దీనిలో భాగంగా ఇప్పటికే ‘ఈశ్వర్’ చిత్రాన్ని రీ-రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో తాజాగా మరో సాలిడ్ న్యూస్ వచ్చింది. ప్రభాస్ నటించిన సలార్ చిత్రం కూడా మళ్ళీ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ మేరకు మేకర్స్ ప్రభాస్ ప్రీ-బర్త్‌డే సెలబ్రేషన్స్‌ను మరింత గ్రాండ్‌గా చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. సలార్ సినిమాను స్పెషల్ షోలుగా ప్రదర్శించనున్నారు. ఈనెల 19, 20 తేదీల్లో హైదరాబాద్‌లోని ప్రముఖ థియేటర్లలో సలార్ స్పెషల్ షోలు వేయనున్నారు.
ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఆయన ఫ్యాన్స్ దీనిని షేర్ చేస్తున్నారు. ఆరోజు ప్రభాస్ అభిమానులందరూ ఈ చిత్రాన్ని వీక్షించేందుకు రావాలని కోరుతూ పోస్టులు పెడుతున్నారు. ఇదిలావుంటే, మరోవైపు మిస్టర్ పర్ఫెక్ట్ సినిమా కూడా అక్టోబరు 22న రీరిలీజ్ కానుంది. దీంతో డార్లింగ్ అభిమానుల ఆనందానికి హద్దే లేకుండా పోయింది.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























