యంగ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న భారీ పీరియాడిక్ థ్రిల్లర్ సినిమా “క”. ఈ సినిమాలో నయన్ సారిక, తన్వీ రామ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. శ్రీమతి చింతా వరలక్ష్మి సమర్పణలో శ్రీచక్రాస్ ఎంటర్ టైన్ మెంట్స్ తో బ్యానర్ పై చింతా గోపాలకృష్ణ రెడ్డి భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో నిర్మిస్తున్నారు. దర్శక ద్వయం సుజీత్, సందీప్ విలేజ్ బ్యాక్ డ్రాప్ యాక్షన్ థ్రిల్లర్ కథతో ”క” సినిమాను రూపొందిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సినిమా దీపావళి పండుగ సందర్భంగా ఈ నెల 31న తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. “క” సినిమాను తెలుగులో ప్రొడ్యూసర్ వంశీ నందిపాటి, మలయాళంలో హీరో దుల్కర్ సల్మాన్ తన వేఫరర్ ఫిలింస్ పై రిలీజ్ చేయబోతున్నారు. ఈ రోజు ”క” సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ ప్రెస్ మీట్ హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా హీరో కిరణ్ అబ్బవరం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తమ సినిమా లొకేషన్‌కు వచ్చి ఏం చెప్పారో వివరించారు. ఈ సందర్భంగా కిరణ్ మాట్లాడుతూ.. “క సినిమాలో జాతర సాంగ్ కు స్పెషల్ అప్లాజ్ వస్తోంది. కథ ప్రకారం ఒక జాతర సాంగ్ ఉంటుంది. ఆ పాటను విజయ్ పొలాకీ మాస్టర్ బాగా కొరియోగ్రాఫ్ చేశారు. నాకు డ్యాన్స్ లు పెద్దగా రావు. మంచి ప్రాజెక్ట్ కు అన్నీ కుదురుతాయి అన్నట్లు డ్యాన్స్ లు కూడా ఈ పాటకు బాగా కుదిరాయి.” అని చెప్పారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ.. “నేను బాగా డ్యాన్స్ చేశాననే ప్రశంసలు వస్తున్నాయి. ఈ చిత్రంలో ఓ ఫైట్ సీక్వెన్స్ ఉంటుంది. 15 నిమిషాల పాటు సాగే ఈ యాక్షన్ సీక్వెన్స్ కు థియేటర్ లో మంచి రెస్పాన్స్ వస్తుందని ఆశిస్తున్నాం. సినిమా రిలీజ్ కు ఇంకా రెండు వారాల పైనే సమయం ఉంది. ఈ నెల 22న ట్రైలర్ రిలీజ్ చేస్తున్నాం. మాకున్న ఈ టైమ్ లో మంచి ప్రమోషన్ చేయబోతున్నాం.” అని విశ్వాసం వ్యక్తం చేశారు.
“క సినిమా ఫస్ట్ డే షూట్‌కు మా లొకేషన్‌కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన కిరణ్.. ఈ సినిమాతో నువ్వు పెద్ద హిట్ కొట్టాలని బెస్ట్ విషెస్ అందించారు. అల్లు అర్జున్ గారి విషెస్ మాకు ఎంతో హ్యాపీగా అనిపించాయి. క సినిమాలో మా డైరెక్టర్స్ క్రియేట్ చేసిన విజువల్స్, సౌండింగ్ చాలా కొత్తగా ఉంటాయి. క అనేది మా సినిమాకు యాప్ట్ టైటిల్. కథ విన్నప్పుడు నేను ఏదైతే ఎగ్జైట్ అయ్యానో అలాంటి ఎగ్జైట్ మెంట్ ఫస్ట్ కాపీ చూసినప్పుడు కూడా కలిగింది” అని అన్నారు హీరో కిరణ్ అబ్బవరం.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:


























