గతేడాది విరుపాక్ష, బ్రో సినిమాలతో ప్రేక్షకులను అలరించిన సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్ ప్రస్తుతం తన 18వ చిత్రంలో నటిస్తున్నాడు. SDT18 (వర్కింగ్ టైటిల్)గా వ్యవహరిస్తున్న ఈ చిత్రంలో సాయి దుర్గ తేజ్ పవర్ ఫుల్ రోల్లో కనిపించనున్నాడు. ‘హనుమాన్’ సినిమాను నిర్మించిన నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ప్రైమ్ షో ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్‌పై గ్రాండ్‌గా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే మొదలయింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
సాయి దుర్గ తేజ్ సరసన ఐశ్వర్య లక్ష్మి కథానాయికగా నటిస్తోంది. ఇటీవలే ఆమె బర్త్ డే సందర్భంగా ఈ సినిమా నుండి తన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేసి విషెస్ తెలిపింది చిత్ర బృందం. కాగా ఐశ్వర్య ఇందులో ‘వసంత’ అనే పాత్ర పోషిస్తోంది. దాదాపు 100 కోట్ల బడ్జెట్‌తో 1940 కాలంనాటి పీరియాడికల్ బ్యాక్ డ్రాప్లో యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి యంగ్ డైరెక్టర్ రోహిత్ దర్శకత్వం వహిస్తున్నాడు.
ఈ క్రమంలో ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో వేసిన భారీ సెట్లో సెకండ్ షెడ్యూల్ జరుపుకుంటోంది. ఇదిలావుంటే, నేడు హీరో సాయి ధరమ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా SDT18 టీమ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చింది. ఈ మేరకు మంగళవారం సోషల్ మీడియా వేదికగా సాయి దుర్గ తేజ్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, మేకర్స్ “ఇంట్రూడ్ ఇన్టు ది వరల్డ్ ఆఫ్ ఆర్కాడీ” (Intrude into the world of Arcady)అనే పేరుతో స్పెషల్ మేకింగ్ వీడియోను విడుదల చేసారు.
ఈ వీడియో గమనిస్తే.. భూమి తన రక్షకుని రాక కోసం ఆత్రంగా ఎదురుచూస్తూ, దుష్ట శక్తుల పట్టులో చాలా కాలంగా బాధపడుతోంది. ఇప్పుడు ఆ నిరీక్షణ ఎట్టకేలకు ముగిసింది. ఈ అద్భుతమైన ప్రపంచానికి ప్రాణం పోసేటప్పుడు ప్రొడక్షన్ టీమ్ అంకితభావంతో చేసిన ప్రయత్నాలను వీడియో ప్రదర్శిస్తుంది. అద్భుతమైన సెట్లు, క్లిష్టమైన ఆయుధాలు సృష్టించడం మరియు నటీనటులను వారి పాత్రలుగా మార్చడం, గొప్ప కష్టాలను భరించిన పాత్రలను చూడవచ్చు.
చివరి ఫ్రేమ్‌లు ముఖ్యంగా అద్భుతమైనవి, మృగం మోడ్‌లో కథానాయకుడిని ప్రదర్శిస్తూ, మండుతున్న భూమిలో నమ్మకంగా ముందుకు సాగుతున్నాయి. మొత్తం మీద, ఇది రాబోయే వాటి యొక్క థ్రిల్లింగ్ ప్రివ్యూ. ఆర్కాడీ ప్రపంచంలోకి ఈ స్నీక్ పీక్ అపారమైన ఉత్సుకతను రేకెత్తిస్తుంది. ముఖ్యంగా సాయి దుర్గ తేజ్ బీస్ట్ మోడ్‌లో ఉత్కంఠభరితమైన దృశ్యంగా ప్రతిదీ అసాధారణమైనదిగా అనిపిస్తుంది. ఇది నిజంగా ఒక పెద్ద కథను సూచిస్తుంది.
కాగా ఈ సినిమాలో విఎఫ్ఎక్స్ పార్ట్ ఎక్కువగా ఉండనుంది. దీంతో కంటెంట్ మీద వున్న నమ్మకంతో ఖర్చుకి ఎక్కడా వెనుకాడకుండా సినిమాను నిర్మిస్తున్నారు నిర్మాతలు. వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ మరియు మలయాళం భాషల్లో పాన్ ఇండియా మూవీగా విడుదలకానున్న ఈ సినిమా సాయి దుర్గా తేజ్‌కు ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో వేచిచూడాలి.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























