సూర్య 45 అనౌన్స్‌మెంట్ వచ్చేసింది

Dream Warrior Pictures Announced Magnum Opus of Suriya45

జోకర్, అరువి, ధీరన్ అధిగారం ఒండ్రు, ఖైదీ, సుల్తాన్, ఒకే ఒక జీవితం, ఫర్హానా వంటి బ్లాక్‌బస్టర్‌లను రూపొందించిన ప్రముఖ నిర్మాణ సంస్థ డ్రీమ్ వారియర్ పిక్చర్స్, తమ బిగ్గెస్ట్ మూవీ ‘సూర్య 45’ని పూజా కార్యక్రమంతో ప్రారంభించింది. ఎస్‌ఆర్‌ ప్రకాష్‌ బాబు, ఎస్‌ఆర్‌ ప్రభు నిర్మించనున్న ఈ చిత్రం ప్రొడక్షన్ హౌస్ యొక్క మోస్ట్ ఎక్స్‌పెన్సీవ్ మూవీగా నిలవనుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మూకుతి అమ్మన్, వీట్ల విశేషం వంటి హిలేరియస్, సోషల్ రెస్పాన్స్‌బులిటీ కలిగిన చిత్రాలకు దర్శకత్వం వహించిన ఆర్జే బాలాజీ ఈ భారీ యాక్షన్ అడ్వెంచర్ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. RJ బాలాజీ ప్రస్తుతం సూర్య 45 ప్రీ-ప్రొడక్షన్‌లో బిజీగా ఉన్నారు. ఈ ఎక్సయిటింగ్ స్క్రిప్ట్‌పై ఒక సంవత్సరానికి పైగా పని చేస్తున్న ఆయన, ఈ పక్కా ఎంటర్‌టైనర్ కోసం లొకేషన్‌లను ఖరారు చేయడానికి రెక్సీ కోసం అనేక ప్రదేశాలను సందర్శిస్తున్నారు.

అకాడమీ అవార్డ్-విన్నింగ్ కంపోజర్ AR రెహమాన్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నారు. రెహమాన్, సూర్య ఇంతకుముందు సిల్లును ఒరు కాదల్, ఆయుధ ఎళుతు, ’24’ వంటి పలు క్లాసిక్ చిత్రాలలో కలిసి పనిచేశారు. నేషనల్ అవార్డు విన్నింగ్ యాక్టర్- కంపోజర్ కాంబో పని చేస్తున్న ఈ చిత్రం బిగ్గెస్ట్ మ్యూజికల్ ట్రీట్‌గా వుండబోతోంది.

RJ బాలాజీ, డ్రీమ్ వారియర్ పిక్చర్స్ ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ కోసం ప్రముఖ నటీనటులు, టెక్నిషియన్స్‌ని ఎంపిక చేయడానికి ప్లాన్ చేస్తున్నాయి. ఈ మూవీని 2024 నవంబర్‌లో సెట్స్‌పైకి తీసుకువెళ్లి 2025 సెకండ్ హాఫ్ లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.