కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ ‘జైలర్’ తర్వాత ‘వేట్టయన్ – ది హంటర్’ సినిమాతో మళ్ళీ ఆ రేంజ్ హిట్ అందుకున్నాడు. యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రంలో రజనీకాంత్ పవర్‌ఫుల్ పోలీసాఫీసర్‌గా నటించగా.. బాలీవుడ్ లెజెండరీ నటుడు అమితాబ్ బచ్చన్, మలయాళ విలక్షణ నటుడు ఫహద్ ఫాసిల్ ముఖ్య పాత్రల్లో కనిపించారు. అలాగే టాలీవుడ్ స్టార్ యాక్టర్ రానా దగ్గుబాటి, మంజు వారియర్ కీలక పాత్రలు పోషించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అలాగే రితికా సింగ్, దుషార విజయన్, రావు రమేష్ తదితరులు ఇతర పాత్రలో నటించారు. సామాజిక ఇతివృత్తాలను వెండితెరపై అద్భుతంగా ప్రజెంట్ చేయగల ప్రముఖ తమిళ డైరెక్టర్ టీజే జ్ఞానవేల్ తెరకెక్కించిన ఈ మూవీ అక్టోబర్ 10న ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరన్ నిర్మించిన ఈ సినిమా తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో విడుదలయ్యింది.
అయితే తొలిరోజే పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న ఈ చిత్రం కలెక్షన్ల పరంగా దూసుకుపోతుంది. ఈ క్రమంలో వేట్టయన్ ఫస్ట్ డే కలెక్షన్లలతో పలు రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఈ ఏడాది తమిళ ఇండస్ట్రీలో విడుదలైన సినిమాలలో తొలిరోజు అత్యధిక కలెక్షన్లు వసూళ్లు చేసిన సినిమాల జాబితాలో సెకండ్ ఫ్లేస్ దక్కించకుంది. వేట్టయన్ తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా 68.4 కోట్ల(గ్రాస్) వసూలు చేయడం గమనార్హం.
అంతకుముందు దళపతి విజయ్ హీరోగా వచ్చిన ‘ది గోట్’ అత్యధికంగా రూ.120 కోట్లు కలెక్షన్లు రాబట్టి టాప్ ఫ్లేస్‌లో నిలిచింది. ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం రజినీకాంత్ 170వ సినిమాగా రూపొందిన వేట్టయన్ నాలుగు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 240 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచింది. ఈ మేరకు చిత్ర యూనిట్ సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించింది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























