ఉస్తాద్ రామ్ పోతినేని తన 22వ మూవీని దసరా పండగ సందర్భంగా అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’తో అలరించిన మహేష్ బాబు పచ్చిగొల్ల ఈ ఎక్సయిటింగ్ ప్రాజెక్ట్‌కి దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రాన్ని ప్రముఖ టాలీవుడ్ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
RAPO22 రామ్ కెరీర్‌కు సిగ్నిఫికెంట్ ఎడిషన్ కానుంది. ఇటీవల యాక్షన్-ఓరియెంటెడ్ పాత్రలతో అలరించిన రామ్ ఈ మూవీలో ఓ యూనిక్ క్యారెక్టర్ లో కనిపించనున్నారు. రామ్ స్టైలిష్ మేకోవర్‌లో కనిపించనున్నారని అనౌన్స్‌మెంట్ పోస్టర్ ద్వారా తెలుస్తోంది. ఈ చిత్రం ఇంపాక్ట్ ఎమోషన్స్ ని ఎక్స్ ఫ్లోర్ చేయనుంది.
రామ్ కెరీర్‌లో ల్యాండ్‌మార్క్ చిత్రాలలో ఒకటిగా నిలుస్తుంది. దర్శకుడు మహేష్ బాబు తన మునుపటి చిత్రాలలో హ్యుమర్, ఎమోషన్స్ బ్లెండ్ చేసి అలరించారు , అప్ కమింగ్ మూవీ కంప్లీట్ ఎంటర్ టైనర్ గా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ మూవీ లైట్ హార్టెడ్ ఎలిమెంట్స్, ఎమోషన్స్ తో ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులని ఎంటర్టైన్ చేయనుంది.
నవీన్ యెర్నేని, వై రవి శంకర్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు, ఇందులో ప్రముఖ నటీనటులు, టాప్ టెక్నీషియన్లు పని చేయనున్నారు. కాగా ఈ మూవీ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. ఈ చిత్రానికి సంబంధించిన ఇతర నటీనటులు, టెక్నికల్ టీం వివరాలు త్వరలో తెలియజేయనున్నారు మేకర్స్.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























