హనుమాన్’ సినిమాతో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా పాపులర్ అయిన డైరెక్టర్ ప్రశాంత్ వర్మ.. ఆ మూవీలో హాలీవుడ్ లోని మార్వెల్స్ తరహాలో భారతీయ తెరపై తొలిసారిగా సూపర్ హీరో క్యారెక్టర్‌ను రూపొందించి సెన్సేషన్ సృష్టించాడు. దీనికి ఇతిహాసాల నేపథ్యం జోడించడం ప్రేక్షకులను అబ్బురపరిచింది. దీంతో ప్రశాంత్ వర్మ తదుపరి సినిమాపై అంచనాలు నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ నేపథ్యంలో హనుమాన్ విజయంతో దీనికి సీక్వెల్‌గా ‘జై హనుమాన్’ చిత్రాన్ని తెరకెక్కించడానికి పూనుకున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ చిత్రీకరణ దశలో ఉంది. ఇదిలాఉంటే, మరోవైపు టాలీవుడ్ అగ్ర హీరో నందమూరి బాలకృష్ణ తనయుడు తారక రామ మోక్షజ్ఞ తేజను హీరోగా పరిచయం చేస్తూ ఇటీవలే ఓ కొత్త సినిమా ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచాడు.
ఈ నేపథ్యంలో ప్రశాంత్ వర్మ గురువారం ఒక బిగ్ అప్‌డేట్ ఇచ్చారు. దసరా పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని ఆయన మరో కొత్త సినిమాను ప్రకటించారు. ఈ సందర్భంగా చిత్రం పేరును ‘మహాకాళి’ గా ఖరారు చేశారు. ఈ మేరకు ప్రశాంత్ వర్మ ప్రముఖ తన అధికారిక సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ వేదికగా వెల్లడించారు.
ఇక ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ మూవీ కూడా పీవీసీయూ (ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్)లో భాగంగా రూపొందుతుండటం గమనార్హం. RKD స్టూడియోస్‌తో కలిసి దీనిని నిర్మించనున్నట్టు ఆయన తెలిపారు. ఆర్‌కె దుగ్గల్ సమర్పణలో రివాజ్ రమేష్ దుగ్గల్ నిర్మించనున్న ఈ సినిమాకు పూజ కొల్లూరు దర్శకత్వం వహించనున్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























