భారతీయ దిగ్గజ వ్యాపారవేత్త, టాటా సన్స్ గౌరవ చైర్మన్ రతన్ టాటా కన్నుమూసిన విషయం తెలిసిందే. వృద్ధాప్య సమస్యలతో అస్వస్థతకు గురైన ఆయనను సోమవారం ముంబైలోని బ్రీచ్ కాండీ హాస్పిటల్‌లో చేరిన ఆయన ఐసీయూలో చికిత్స పొందుతూ పరిష్టితి విషమించి బుధవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. దీంతో దేశవ్యాప్తంగా విషాదఛాయలు అలుముకున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ నేపథ్యంలో రతన్ టాటా మృతిపట్ల సినీ, రాజకీయ ప్రముఖులు విచారం వ్యక్తం చేస్తున్నారు. రతన్ టాటా మరణం పట్ల సంతాపం తెలిపిన ప్రధాని నరేంద్ర మోదీ, రతన్ టాటా.. దూరదృష్టి కలిగిన వ్యాపార నాయకుడని, దయాగుణం కలిగిన అసాధారణ మనిషి అని ‘ఎక్స్’లో కొనియాడారు. అలాగే రతన్ టాటా వ్యాపారంతో పాటు దాతృత్వంలోనూ తనదైన ముద్ర వేసుకున్నారని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు.
ఇక రతన్ టాటా మృతిపై టాలీవుడ్ కూడా స్పందించింది. స్టార్ హీరోలు మెగాస్టార్ చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్, రానా దగ్గుబాటి, దిగ్గజ దర్శకుడు ఎస్ఎస్. రాజమౌళి తదితరులు టాటా మరణవార్త దిగ్భ్రాంతి కలిగించిందని పేర్కొంటూ సంతాపం తెలిపారు. మరోవైపు బాలీవుడ్ ప్రముఖులు కూడా దీనిపై స్పందిస్తున్నారు. సంజయ్ దత్, సల్మాన్ ఖాన్, అజయ్ దేవగణ్, అక్షయ్ కుమార్, రితేష్ దేశ్ ముఖ్, వరుణ్ ధావన్, ప్రియాంక చోప్రా సహా మరికొందరు సెలబ్రిటీలు రతన్ టాటా మృతిపై విచారం వ్యక్తం చేశారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: