రివ్యూ : వేట్టయన్

Vettaiyan Telugu Review,Telugu Filmnagar,Latest Telugu Movies News,Latest Tollywood Updates,Telugu Film News 2024,Tollywood Movie Updates,Latest Tollywood Movie Updates,Telugu Cinema News 2024,2024 Latest Telugu Reviews,Vettaiyan Movie Review,Vettaiyan Review,Vettaiyan Movie Telugu Review,Vettaiyan Critics Review,Vettaiyan First Review,Vettaiyan Highlights,Vettaiyan Plus Points,Vettaiyan Public Response,Vettaiyan Public Talk,Vettaiyan Story Review,Vettaiyan Movie Public Response,Vettaiyan Movie Review And Rating,Vettaiyan,Vettaiyan Movie,Vettaiyan Telugu Movie,Vettaiyan Movie Updates,Rajinikanth Vettaiyan Review,Rajinikanth Vettaiyan Movie,Rajinikanth,Vettaiyan The Hunter Telugu Review,Vettaiyan The Hunter Review,Vettaiyan The Hunter First Review,Vettaiyan The Hunter Movie Review,Vettaiyan The Hunter Telugu Movie Review,Vettaiyan The Hunter,Vettaiyan The Hunter Review in Telugu,Amitabh Bachchan

నటీనటులు : రజినీకాంత్,మంజు వారియర్ ,రానా ,ఫహాద్ ఫాజిల్
ఎడిటింగ్ : ఫిలోమిన్ రాజ్
సినిమాటోగ్రఫీ : ఎస్ ఆర్ కథిర్
సంగీతం :అనిరుధ్
దర్శకత్వం : టీజీ జ్ఞానవేల్ రాజా
నిర్మాణం : లైకా ప్రొడక్షన్స్

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

దసరా బరిలో మొదటి సినిమాగా వచ్చింది సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన వేట్టయన్ :ది హంటర్.జైలర్ తరువాత రజినీ హీరోగా నటించిన సినిమా కావడం, జై భీమ్ ఫేమ్ టీజీ జ్ఞానవేల్ రాజా దీనిని డైరెక్ట్ చేయడం అలాగే అమితాబ్ బచ్చన్ ,రానా,ఫహద్ ఫాజిల్ ఇందులో కీలక పాత్రలు చేయడంతో సినిమా పై ముందు నుండి మంచి అంచనాలు వున్నాయి.మరి ఈసినిమా ఆ ఆంచనాలను అందుకుందా? ఇంతకీ ఈ వేట్టయన్ ఎలా వుందో ఇప్పుడు చూద్దాం.

కథ:

అతియన్ (రజినీకాంత్) రూత్ లెస్ పోలీస్ ఆఫీసర్.చట్టాలకు అతీతంగా పనిచేస్తూ ఉంటాడు.కరుడు కట్టిన నేరస్థులను ఫేక్ ఎన్కౌంటర్ పేరుతో ఏరిపారేస్తుంటాడు.ఇలా చేయడం అమితాబ్ కు నచ్చదు.న్యాయ బద్దంగానే దోషులకు శిక్ష పడాలంటాడు.అయితే ఓ రోజు ఓ స్కూల్ టీచర్ శరణ్య(దుషారా విజయన్ ) దగ్గరినుండి అతియన్ కు ఫోన్ వస్తుంది.స్కూల్ లో గంజాయి స్టోర్ చేస్తున్నారని కంప్లైంట్ ఇస్తుంది.దాంతో రంగంలోకి దిగి రజినీ ఆ కేసు ను సాల్వ్ చేస్తాడు.ఆ తరువాత శరణ్యకు అవార్డు కూడా లభిస్తుంది.ఈ క్రమంలో ఓ రోజు అదే స్కూల్ లో శరణ్య దారుణంగా హత్య కు గురవుతుంది.

ఇక ఆ హత్యను ఛేదించడానికి అతియన్ రంగంలో దిగుతాడు.అయితే ఆమె హత్య వెనుక చాలా పెద్ద మిస్టరీ ఉంటది.మరి ఈహత్య ను ఛేదిస్తున్న క్రమంలో అతియన్ కు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి.ఇంతకీ శరణ్యను హత్య చేసింది ఎవరు? దాని వెనుక ఎవరెవరు వున్నారు ? అతియన్ ఈ ఇన్వెస్టిగేషన్ ను సక్సెస్ ఫుల్ ముగించగలిగాడా లేదా అనేది మిగితా కథ.

విశ్లేషణ :

క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డ్రామాగా వచ్చింది ఈసినిమా.అయితే ఇందులో సాలిడ్ సోషల్ మెసేజ్ కూడా ఇచ్చాడు దర్శకుడు టీజీ జ్ఞానవేల్ రాజా.ఫేక్ ఎన్కౌంటర్స్,ఎడ్యుకేషన్ స్కామ్ వంటి సీరియస్ ఇష్యుస్ ని అడ్రెస్ చేశాడు.రజినీ స్వాగ్ ను గట్టిగానే వాడుకున్నాడు.ఫస్ట్ 25 నిమిషాలు రజినీ హీరోయిజం ఆకట్టుకుంటుంది.ఇక అసలైన కథ లోకి వెళ్ళాకా సినిమా సీరియస్ మోడ్ లోకి మారుతుంది.

ఫస్ట్ హాఫ్ ఎంగేజింగ్ గా ఉండి సెకండ్ హాఫ్ పై ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తుంది.ఇక సెకండ్ హాఫ్ హీరోకి విలన్ మధ్య సాగుతుంది.అయితే మధ్యలో నరేషన్ కొంచెం ఫ్లాట్ గా అనిపిస్తుంది కానీ చివర్లో సినిమాను ముగించిన తీరు మెప్పిస్తుంది.ఓవరాల్ గా ఫస్ట్ హాఫ్ సూపర్ అనిపించగా సెకండ్ హాఫ్ డీసెంట్ గా ఉంటుంది.రిలీజ్ కు ముందు అదరగొట్టిన మనసిలాయో సాంగ్ తెర మీద కూడా సూపర్ అనిపిస్తుంది.

నటీనటుల విషయానికి వస్తే రజినీకాంత్ అదరగొట్టాడు.తన స్వాగ్ ఫ్యాన్స్ ను ఖుషి చేస్తుంది.వయసు తో సంబంధం లేకుండా చాలా హుషారుగా కనిపించాడు.జైలర్ తరువాత మరోసారి అలాంటి పాత్ర చేశాడు.ఇక రజనీ తరువాత సినిమాలో ఫహద్ ఫాజిల్ రోల్ హైలైట్ అయ్యింది.తన పాత్రలో సూపర్ అనిపించాడు.అమితాబ్ బచ్చన్ పాత్ర హుందాగా వుంది.తనకు రజినీ కి వచ్చే సన్నివేశాలు మెప్పిస్తాయి.అలాగే రానా కూడా ఇంపాక్ట్ వున్న పాత్రలో కనిపించాడు. ఇక కీలకపాత్రల్లో కనిపించిన మంజు వారియర్,రితిక సింగ్,దుషారా విజయన్ పాత్రల పరిధి మేర నటించారు.

టెక్నీకల్ గా కూడా సినిమా ఉన్నతంగా వుంది.డైరెక్టర్ టీజీ జ్ఞానవేల్ రాజా ఈ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ను నీట్ గా ప్రెజెంట్ చేశాడు.ఇందులో సాలిడ్ మెసేజ్ కూడా ఇచ్చాడు.సినిమాటోగ్రఫీ బాగుంది.విజువల్స్ అదిరిపోయాయి.ఎడిటింగ్ ఓకే.అనిరుధ్ మ్యూజిక్ సినిమాకు చాలా ప్లస్ అయ్యింది.కథకు తగ్గట్లు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు.యాక్షన్ సన్నివేశాల్లో తన బీజీఎమ్ తో అదరగొట్టాడు.నిర్మాణం గురించి వంక పెట్టడానికిలేదు.చాలా క్వాలీటితో సినిమాను నిర్మించారు.

ఓవరాల్ గా భారీ అంచనాలతో వచ్చిన వేట్టయన్ ఖచ్చితంగా ఓ సారి చూసేలా ఉందని చెప్పొచ్చు.ఇందులో రజినీ నటన ,ఫహద్ ఫాజిల్,స్టోరీ హైలైట్ అయ్యాయి.సాలిడ్ సోషల్ మెసేజ్ ను ఇచ్చిన ఈసినిమా రజినీ ఫ్యాన్స్ తోపాటు క్రైమ్ థ్రిల్లర్ లను ఇష్టపడే వారికి నచ్చుతుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.