మరో రెండు రోజుల్లో విశ్వంతో వస్తున్నాడు మాచో స్టార్ గోపిచంద్.ఈహీరో ఎప్పటినుండో ఓ సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు.తనకు ఈఏడాది ఇది సెకండ్ రిలీజ్.మార్చిలో భీమాతో వచ్చాడు.ఈసినిమా తన గత చిత్రాలకంటే పర్వాలేదనిపించింది కానీ కావాల్సిన సక్సెస్ ను మాత్రం ఇవ్వలేకపోయింది.ఇక ఇప్పుడు విశ్వంతో సాలిడ్ హిట్ కొట్టి ఫామ్ లోకి వస్తానని గోపిచంద్ కాన్ఫిడెంట్ గా వున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
శ్రీను వైట్ల డైరెక్షన్ లో తెరకెక్కిన ఈసినిమాలో కావ్య థాపర్ హీరోయిన్ గా నటించగా చైతన్య భరద్వాజ్ సంగీతం అందించాడు.పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ,చిత్రాలయం బ్యానర్స్ ఈసినిమాను నిర్మించాయి.ఈసినిమా విజయం శ్రీను వైట్లకు కూడా కీలకం కానుంది.చాలా గ్యాప్ తరువాత శ్రీను వైట్ల నుండి వస్తున్న సినిమా ఇదే.ఈసినిమా తనకు కం బ్యాక్ ఫిలిం అవుతుందని తను కూడా బలంగా నమ్ముతున్నాడు.
ఇదిలావుంటే గోపిచంద్ నెక్స్ట్ సినిమాను ఓ కొత్త దర్శకుడితో చేయనున్నాడని సమాచారం.ఫ్రెష్ సబ్జెక్టు తో భారీ లెవల్లో ఈసినిమాను ప్లాన్ చేస్తున్నారు.రీసెంట్ గా కథను విని గోపిచంద్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట.యూవీ క్రియేషన్స్ ఈసినిమాను నిర్మించనుంది.అన్ని కుదిరితే త్వరలోనే ఈసినిమా గురించి అఫీషియల్ అప్డేట్ రానుంది.ఇక పంతం తరువాత గోపిచంద్ కొత్త దర్శకుల తో సినిమాలు చేయలేదు.ఇక ఇప్పుడు మళ్ళీ కొత్త దర్శకుడికి ఛాన్స్ ఇస్తున్నాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























