నవ దళపతి సుధీర్ బాబు హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘మా నాన్న సూపర్ హీరో’తో త్వరలో ప్రేక్షకులను అలరించబోతున్నారు. అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని CAM ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిసి V సెల్యులాయిడ్స్ బ్యానర్‌పై ప్రొడ్యూసర్ సునీల్ బలుసు గ్రాండ్‌గా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ఆర్ణ హీరోయిన్‌గా నటిస్తుండగా.. సీనియర్ నటులు సాయి చంద్, సాయాజీ షిండే కీలక పాత్రలు పోషిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇప్పటికే విడుదలైన ఈ మూవీ ప్రమోషనల్ కంటెంట్ స్ట్రాంగ్ బజ్ క్రియేట్ చేసింది. ఇక మా నాన్న సూపర్ హీరో అక్టోబర్ 11న గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ నుండి సాలిడ్ అప్డేట్ అందింది. విడుదలకు రెండు రోజుల ముందుగానే ఈ సినిమాను వీక్షించే అవకాశం కలిపించారు మేకర్స్. అంటే, అక్టోబర్ 9న మా నాన్న సూపర్ హీరో సినిమా స్పెషల్ ప్రీమియర్స్ వేయనున్నట్టు తెలిపారు. అయితే ఈ అవకాశం కేవలం రెండు ప్రాంతాలకే పరిమితం.
విజయవాడ మరియు వైజాగ్‌లో ఈ స్పెషల్ ప్రీమియర్స్ ప్రదర్శించనున్నారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ వివరాల ప్రకారం, విజయవాడలోని ప్రముఖ థియేటర్ రాజ్-యువరాజ్, అలాగే వైజాగ్‌లోని సంగం థియేటర్, ఇంకా రాజమండ్రిలోని సూర్య కాంప్లెక్స్‌లో ఆరోజు సాయంత్రం 6:30 గంటలకు ఈ ప్రీమియర్స్ స్క్రీనింగ్ జరుగనుంది. ఇక ఈ టికెట్స్ కోసం బుక్ మై షోను సంప్రదించాల్సిందిగా చిత్ర యూనిట్ తెలిపింది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























