విశ్వంతో శ్రీను వైట్ల ఈజ్ బ్యాక్ విత్ బ్యాంగ్

Gopichand Says, Director Sreenu Vaitla is Back with Bang by Viswam

మాచో స్టార్ గోపీచంద్, దర్శకుడు శ్రీను వైట్ల ఫస్ట్ కొలాబరేషన్‌లో వస్తున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ ‘విశ్వం’. కావ్యా థాపర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ హై బడ్జెట్ ఎంటర్‌టైనర్‌ను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, వేణు దోనేపూడి చిత్రాలయం స్టూడియోస్‌పై టిజి విశ్వప్రసాద్ నిర్మిస్తుండగా.. దోనేపూడి చక్రపాణి ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈ సినిమా నుండి ఇప్పటివరకూ రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్ ట్రెమండస్ రెస్పాన్స్‌తో చిత్రంపై హ్యుజ్ బజ్ క్రియేట్ చేశాయి. దసరా కానుకగా అక్టోబర్ 11న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా గ్రాండ్‌గా ప్రీరిలీజ్ ఈవెంట్‌ని నిర్వహించారు. చిత్ర యూనిట్ అంతా పాల్గొన్న ఈ వేడుక ఘనంగా జరిగింది.

గ్రాండ్‌గా జరిగిన ఈ ప్రీరిలీజ్ ఈవెంట్‌లో హీరో గోపీచంద్ చిత్ర విశేషాలు పంచుకున్నారు. గోపీచంద్ ఏమన్నారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం.. “అందరికీ నమస్కారం. చాలా రిస్కీ ప్లేసెస్‌లో ఈ సినిమాని షూట్ చేశాం. ఈరోజు సినిమా ఇంత అద్భుతంగా వచ్చిందంటే టెక్నీషియన్స్ హార్డ్ వర్కే కారణం. మ్యూజిక్ డైరెక్టర్ చేతన్ సౌండింగ్ చాలా కొత్తగా ఉంది. ఎక్స్ ట్రార్డినరీ సాంగ్స్ ఇచ్చాడు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ఇరగదీసాడు. తను చాలా పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అవుతాడు.”

“గుహన్ గారితో ఎప్పటినుంచో వర్క్ చేయాలని అనుకున్నాం. ఈ సినిమాతో కుదిరింది. లొకేషన్స్, యాక్టర్స్‌ని చాలా అందంగా చూపిస్తారు. ఎక్స్‌ట్రార్డినరీ అవుట్ పుట్ ఇచ్చారు. ప్రొడ్యూసర్స్ ఇద్దరికీ థాంక్స్. విశ్వప్రసాద్ గారు ఈ సినిమాకి రావడం చాలా ప్లస్ అయింది. గోపి మోహన్‌తో పాటు ఈ సినిమాకి పనిచేసిన రైటర్స్‌కి థాంక్యూ. గోపి మోహన్ గారు లక్ష్యం, లౌక్యం సినిమాలకి పని చేశారు. విశ్వం కూడా సేమ్ రేంజ్ ఆఫ్ హిట్ అవుతుంది.”

“ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఆర్టిస్ట్‌కి సారీ చెప్పాలి (నవ్వుతూ) ఎందుకంటే యాక్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళ రియాక్షన్ చూస్తున్నప్పుడు నాకు నవ్వు వచ్చేసింది. సీన్స్ అంత బాగా వచ్చినాయి. ప్రతి సీన్ చేసేటప్పుడు సెట్‌లో నవ్వుకుంటూనే ఉన్నాం. ఈ సినిమాలో పని చేసిన ఆర్టిస్టులు అందరికీ థాంక్యూ. డైరెక్టర్ శ్రీను గారితో ఎప్పటినుంచో వర్క్ చేయాలని అనుకుంటున్నాను. టూ ఇయర్స్ బ్యాక్ ఒక ఫంక్షన్‌లో కలిసాం. అప్పటినుంచి జర్నీ స్టార్ట్ అయింది. ఆయన స్క్రిప్ట్ చెప్తున్నప్పుడు నవ్వుతూనే ఉన్నాను.”

“ఆడియెన్స్ తన సినిమాలో ఎంత ఎంటర్‌టైన్‌మెంట్ ఆశిస్తారో అంత ఎంటర్‌టైన్‌మెంట్ ఇవ్వడానికి ఆయన స్క్రిప్ట్ మీద దాదాపు 7 నెలలు పని చేశారు. ఆయన సీన్ చెప్పినప్పుడే చాలా అద్భుతంగా పెర్ఫార్మ్ చేస్తారు. ఆయన మార్క్ ప్రతి ఆర్టిస్ట్‌లో కనిపిస్తుంది. ఆయన టైమింగ్ చాలా యూనిక్‌గా ఉంటుంది. ఆయనతో జర్నీని చాలా ఎంజాయ్ చేశాను. ఒక బ్రదర్‌గా ఫీల్ అయ్యాను. ఆయన ఎక్స్ ట్రార్డినరీ పర్సన్. ఆర్టిస్ట్‌ని కంఫర్ట్ జోన్ లోకి తీసుకువచ్చి తనకు కావాల్సింది తీసుకుంటారు.”

“ఇప్పటివరకూ నేను చాలా సినిమాలు చేశాను. అయితే ఇంత కంఫర్ట్ ఎక్కడ ఫీల్ అవ్వలేదు. శ్రీను గారు చాలా యూనిక్ పర్సన్. కంటిన్యూస్‌గా సినిమా మీదే వర్క్ చేస్తుంటారు. వేరే డైవర్షన్ ఉండదు. అక్టోబర్ 11న దసరాకి సినిమా రిలీజ్ అవుతుంది. థియేటర్లో కూర్చున్న ప్రతి ఒక్కరికీ నవ్వు ఆగదు. యాక్షన్, కామెడీ, ఫన్ ఎక్స్‌ట్రార్డినరీగా వచ్చింది. ప్రేక్షకులు చాలా ఎంజాయ్ చేస్తారు. ఒక మాట చెప్పగలను. శ్రీను వైట్ల గారు ఈజ్ బ్యాక్ విత్ బ్యాంగ్. థాంక్ యూ సో మచ్” అని హీరో గోపీచంద్ అన్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.