తమిళ హీరో శివ కార్తికేయన్ జవాన్ గా నటించిన సినిమా అమరన్.రాజ్ కుమార్ పెరియస్వామి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈసినిమా మేజర్ ముకుంద్ వరదరాజన్ బయోపిక్ గా వస్తుంది.మేజర్ ముకుంద్ గా శివ కార్తికేయన్ అలాగే తన సతీమణి సింధు పాత్రలో సాయి పల్లవి నటించింది.కొద్దీ రోజుల క్రితం ఈసినిమా నుండి సాయి పల్లవి పాత్రను పరిచయం చేశారు.ఇక మూడు రోజుల క్రితం ఫస్ట్ సింగిల్ హే మిన్నలే రిలీజ్ కాగా సూపర్ రెస్పాన్స్ వచ్చింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈరోజు తెలుగు వెర్షన్ హే రంగులే సాంగ్ ను రిలీజ్ చేశారు.టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ ఈసాంగ్ ను లాంచ్ చేశాడు.సరస్వతీ పుత్ర రామజోగయ్య శాస్త్రి రాసిన లిరిక్స్ లీడ్ పెయిర్ కెమిస్ట్రీ ని అద్భుతంగా ప్రజెంట్ చేశాయి.అనురాగ్ కులకర్ణి,రమ్య బెహరా తమ లైవ్లీ వోకల్స్ తో కట్టిపడేశారు.ఈ సాంగ్ లో శివకార్తికేయన్, సాయి పల్లవి క్యారెక్టర్స్ లైఫ్ జర్నీ బ్యూటీఫుల్ గా వుంది.
నితిన్ సొంత బ్యానర్ శ్రేష్ట్ మూవీస్ ఈసినిమాను తెలుగులో విడుదలచేస్తుంది.ఈ సినిమాపై మంచి అంచనాలు వున్నాయి.రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో ప్రమోషన్స్ లో జోరు పెంచనుంది అమరన్ టీం.స్టార్ హీరో కమల్ హాసన్ సొంత బ్యానర్ రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ నిర్మిస్తుండగా జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు.అక్టోబర్ 31న అమరన్ తమిళం తోపాటు తెలుగులోనూ విడుదలకానుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























