నాచురల్ స్టార్ నాని- డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ లో వచ్చినా దసరా గత ఏడాది విడుదలై నానికి కెరీర్ బిగ్గెస్ట్ హిట్ ఇచ్చింది.ఈసినిమా తరువాత నాని రెండు సినిమాలు చేశాడు అవి రిలీజై బ్లాక్ బాస్టర్స్ అయ్యాయి.కానీ దసరా ను మాత్రం దాటలేకపోయాయి.ఇక ఇప్పుడు దసరా కాంబినేషన్ మరోసారి రిపీట్ కానుంది.దసరా తరువాత శ్రీకాంత్ మరో సినిమా చేయలేదు.మళ్ళీ నాని కోసమే కథ సిద్ధం చేసుకున్నాడు.ఈసారి దసరాకు మించి డబుల్ యాక్షన్ ను చూపించనున్నాడు.ఈసినిమా దసరా రోజు ఈనెల 12న లాంచ్ కానుందని సమాచారం.ఇప్పటికే అనౌన్స్ మెంట్ వీడియోను సిద్ధం చేసి పెట్టుకున్నారు.ఇది కూడా లాంచ్ రిలీజ్ రోజే రిలీజ్ చేయనున్నారట.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
దసరాను నిర్మించిన నిర్మాత చెరుకూరి సుధాకర్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.వచ్చే నెలలో షూటింగ్ ను మొదలు పెట్టాలని చూస్తున్నారు.అనిరుధ్ ను సంగీత దర్శకుడిగా తీసుకోవాలనుకుంటున్నారు.లాంచ్ రోజు ఈ విషయంలో క్లారిటీ వచ్చే ఛాన్స్ వుంది.వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ చేసే ప్లాన్ చేస్తున్నారు.
ఇక నాని ప్రస్తుతం హిట్ 3 చేస్తున్నాడు.ఇందులో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది.శైలేష్ కొలను డైరెక్ట్ చేస్తుండగా ప్రశాంతి త్రిపిర్నేని నిర్మిస్తుంది.ఈ సినిమా తోపాటు సమాంతరంగా నాని, శ్రీకాంత్ ఓదెల సినిమాను చేయనున్నాడు.ప్రస్తుతం నాని పీక్ ఫామ్ లో వున్నాడు.రీసెంట్ గా సరిపోదా శనివారం తో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. ఈసినిమా 100కోట్ల వసూళ్లను రాబట్టింది.నానికి ఇది రెండో 100కోట్ల సినిమా.అంతేకాదు వరుసగా మూడో హిట్ .దాంతో హ్యాట్రిక్ పూర్తి చేశాడు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























