వెర్సటైల్ యాక్టర్ సుహాస్, సంగీర్తన హీరో హీరోయిన్లుగా రూపొందిన చిత్రం ‘జనక అయితే గనక’. శిరీష్ సమర్పణలో దిల్ రాజు ప్రొడక్షన్స్ పతాకంపై హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి నిర్మించారు. సందీప్ రెడ్డి బండ్ల డైరక్ట్ చేశారు. ఇప్పటి వరకు చిత్రం నుంచి రిలీజ్ చేసిన పోస్టర్లు, పాటలు, టీజర్‌లు ఇలా అన్నీ కూడా ఆడియెన్స్‌లో మంచి బజ్‌ను క్రియేట్ చేశాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా జనక అయితే గనక సినిమా దసరా సందర్భంగా అక్టోబర్ 12న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్రయూనిట్ రీసెంట్‌గా మీడియా ముందుకు వచ్చింది. ఈ కార్యక్రమంలో ప్రొడ్యూసర్ దిల్ రాజు సహా సినిమాలో పనిచేసిన నటీనటులు, దర్శకుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సినిమాకు సంబంధించిన పలు విశేషాలు వివరించారు.
ఈ సందర్భంగా ప్రొడ్యూసర్ హర్షిత్ రెడ్డి మాట్లాడుతూ.. ‘సందీప్ రెడ్డి ఈ కథను కరోనా టైంలో చెప్పాడు. ఇలాంటి పాయింట్‌తో అంటే దిల్ రాజు గారు ఒప్పుకుంటారా? లేదా? అని సందీప్ అనుకున్నారు. కానీ దిల్ రాజు గారెకి ఓ ఐదు నిమిషాలు చెప్పడం, ఆ పాయింట్ నచ్చడంతో ముందుకు జరిగింది. ఈ చిత్రం మాకు చాలా స్పెషల్. సందీప్‌తో ఆరేళ్లుగా ప్రయాణం చేస్తూ వస్తున్నాను. ఐడియాలజీని నమ్మి ముందుకు వెళ్లండని సాయి దుర్గ తేజ్ చెబుతుంటారు” అని తెలిపారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ.. “మా సినిమా అంతా కూడా ఐడియాలజీల మీదే ప్రయాణం ఉంటుంది. ఫాదర్, గ్రాండ్ మదర్, వైఫ్, హజ్బెండ్ ఇలా అందరి కోణంలోనూ ఈ చిత్రం ఉంటుంది. ‘రైటర్ పద్మభూషణ్’ తరువాత ఈ చిత్రానికి దిల్ రాజు గారే సుహాస్ పేరు చెప్పారు. ఈ మూవీతో డిస్ట్రిబ్యూటర్ కూడా కాబోతోన్నాడు. ఆయనకు ఆల్ ది బెస్ట్. సంగీర్తన బాగా నటించిందని సినిమా చూసిన వాళ్లంతా చెబుతున్నారు. ఈ మూవీ అందరినీ ఆకట్టుకుంటుంది” అని అన్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























