అజిత్ కుమార్‌ గుడ్‌ బ్యాడ్ అగ్లీ లో స్టార్ యాక్టర్

Actor Prasanna Joins Ajith Kumar's Film Good Bad Ugly

కోలీవుడ్ స్టార్‌ హీరో అజిత్ కుమార్‌ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’. అధిక్‌ రవిచంద్రన్ దర్శకత్వంలో ఫుల్ యాక్షన్‌ ప్యాక్‌డ్‌ డ్రామా నేపథ్యంలో రూపొందుతోంది. త్రిష ఫీ మేల్ లీడ్‌ రోల్‌లో నటిస్తుండగా.. రాక్‌స్టార్ దేవీ శ్రీ ప్రసాద్‌ మ్యూజిక్‌, బ్యాక్‌ గ్రౌండ్ స్కోర్‌ అందిస్తున్నాడు. ఈ చిత్రం నుంచి ఇప్పటికే లాంచ్ చేసిన ఫస్ట్‌ లుక్‌తో పాటు ఇతర ప్రమోషనల్ కంటెంట్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది. ప్రముఖ నటి స్నేహ భర్త, కోలీవుడ్ స్టార్ యాక్టర్ ప్రసన్న ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా సోషల్ మీడియాలో తెలియజేశాడు. ఈ మేరకు ఎక్స్‌లో ప్రసన్న ఇలా తెలిపారు.. “డియర్ ఫ్రెండ్స్.. ఈసారి నా కల నిజమైంది. మన ప్రియతమ ‘థలా’ అజిత్ కుమార్ సార్ సినిమాలో నేను భాగమయ్యాననేది నిజం. ‘మన్‌కథా’ నుంచి ఏకే సార్‌ సినిమాలు ప్రకటించిన ప్రతి సందర్భంలో అందులో నేను కూడా భాగమని ఆయన అభిమానులు సహజంగా భావించేవారు.”

“అలాగే ఇప్పుడు గుడ్ బ్యాడ్ అగ్లీలో భాగమయ్యాను. దేవుడికి, ఏకే సార్‌కి, అధిక్‌ రవిచంద్రన్‌కు, సురేష్‌చంద్ర సర్‌కు, మైత్రీ మూవీస్‌ మేకర్స్‌కు, చివరిగా తలాతో నన్ను తన సినిమాలో చూడాలని కోరుకున్న ప్రతి ఒక్కరికీ నా కృతజ్ఞతలు. గుడ్‌ బ్యాడ్ అగ్లీలో భాగమైనందుకు నేను థ్రిల్‌గా, ఉత్సాహంగా ఉన్నాను. నేనిప్పుడు చాలా విషయాలు వెల్లడించలేను.. క్షమించండి. మొదటి షెడ్యూల్‌ షూట్‌లో పాల్గొన్నా. ధన్యవాదాలు, మీ అందరికీ చాలా ప్రేమతో..” అంటూ స్పెషల్ ట్వీట్ చేశాడు ప్రసన్న.

టాలీవుడ్ టాప్‌ ప్రొడక్షన్‌ బ్యానర్‌ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా థియేటర్లలో విడుదల కానుంది. ఇకఇదిలావుంటే, మరోవైపు అజిత్‌ కుమార్, మగిజ్ తిరుమేని డైరెక్షన్‌లో ‘విడాముయార్చి’ అనే సినిమాలో కూడా నటిస్తున్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.