దేవర సక్సెస్‌ మీట్ రద్దు.. నాగవంశీ ట్వీట్ వైరల్

Producer Naga Vamsi Sorry To NTR Fans as Devara Success Meet Cancelled

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ టైటిల్ రోల్‌లో నటించిన లేటెస్ట్ మూవీ ‘దేవర’. తారక్ సోలో హీరోగా వచ్చి దాదాపు ఆరేళ్ళు కావడం, అలాగే ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత స్క్రీన్ పైన కనిపించి రెండేళ్లకు పైగా అవడంతో ఆయన అభిమానులు సినిమా చూసేందుకు థియేటర్లకు పరుగులుతీశారు. విడుదలకు ముందే భారీ హైప్ తెచ్చుకున్న దేవర చిత్రం అంచనాలకు తగ్గట్టుగానే బాక్సాఫీస్ వద్ద విధ్వంసం సృష్టిస్తోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ క్రమంలో ఇప్పటివరకూ ప్రపంచవ్యాప్తంగా 6 రోజుల్లో 396 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. తెలుగు రాష్ట్రాలలో మరో పదిరోజులు దసరా సెలవులు ఉన్నందున ఈ నంబర్ మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో నిర్మాతలు దేవర సక్సెస్‌ మీట్ ఘనంగా నిర్వహించడానికి ప్లాన్ చేశారు. అయితే పలు అనివార్య కారణాల వలన ఈ కార్యక్రమం రద్దయింది.

దీంతో ఎన్టీఆర్ అభిమానులు చాలా నిరాశ చెందారు. అంతకుముందు సినిమా విడుదలకు ముందు హైదరాబాద్ లో తలపెట్టిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ఇలానే రద్దు కావడం తెలిసిందే. ఊహించినదానికంటే భారీ సంఖ్యలో అభిమానులు పోటెత్తడంతో నిర్వాహకులు వేడుక నిర్వహించలేక చేతులు ఎత్తేశారు. ఆగ్రహం చెందిన జూనియర్ ఫ్యాన్స్ ఫ్లెక్సీలు చించివేసి హంగామా సృష్టించారు.

ఈ నేపథ్యంలో తాజాగా దేవర సక్సెస్‌ మీట్ కూడా రద్దు కావడంతో తారక్ అభిమానులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. దీనిపై తెలుగు రాష్ట్రాలలో దేవర డిస్ట్రిబ్యూషన్స్ దక్కించుకున్న నిర్మాత సూర్యదేవర నాగవంశీ స్పందించారు. సోషల్ మీడియా వేదికగా ఎన్టీఆర్ అభిమానులకు క్షమాపణలు తెలియజేశారు. ఈ మేరకు నాగవంశీ ఎక్స్ వేదికగా ఇలా తెలిపారు..

“దేవర తుఫానును సృష్టించి, బాక్స్ ఆఫీస్ వద్ద అపూర్వమైన రికార్డులను నెలకొల్పడంలో భాగస్వామ్యమైన మీలో ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిర్వహించలేకపోయినందున, తారక్ అన్న తెలుగు రాష్ట్రాల్లోని తన అభిమానులతో దేవర విజయాన్ని ఘనంగా జరుపుకోవడానికి ఒక ఈవెంట్‌ను నిర్వహించాలని బలంగా అనుకున్నాడు.”

“అయితే మేము ఎడతెగని ప్రయత్నాలు చేసినప్పటికీ, దసరా మరియు దేవీ నవరాత్రి ఉత్సవాల కారణంగా, మా భారీ విజయోత్సవ వేడుకల కోసం రెండు తెలుగు రాష్ట్రాల్లో బహిరంగ వేదికలకు అనుమతులు పొందలేకపోయాము. ఈ పరిస్థితి మా నియంత్రణలో లేదని తారక్ అభిమానులకు సవినయంగా తెలియజేస్తున్నాం.”

“ఈ ఈవెంట్‌ను నిర్వహించలేకపోయినందుకు అభిమానులందరికీ మరియు మా ప్రేక్షకులకు మేము హృదయపూర్వకంగా క్షమాపణలు కోరుతున్నాము. అయినప్పటికీ, మేము ఇంకా ప్రయత్నిస్తున్నాము. బ్లాక్ బస్టర్ దేవర & తారక్ అన్నలను కొత్త శిఖరాలకు తీసుకెళ్లే శక్తిగా మీరు అర్థం చేసుకుని, కొనసాగుతారని ఆశిస్తున్నాము” అని అందులో పేర్కొన్నారు.

కాగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్స్ జాన్వీ కపూర్ కథానాయికగా నటించగా.. సైఫ్ అలీఖాన్ విలన్ పాత్రలో కనిపించారు. అలాగే ప్ర‌కాష్ రాజ్‌, శ్రీకాంత్‌, షైన్ టామ్ చాకో, అజ‌య్, గెట‌ప్ శీను త‌దిత‌రులు ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ స‌మ‌ర్ప‌ణ‌లో ఎన్టీఆర్ ఆర్ట్స్‌, యువ సుధ ఆర్ట్స్ ప‌తాకాల‌పై మిక్కిలినేని సుధాక‌ర్‌, హ‌రికృష్ణ‌.కె ఈ సినిమాను నిర్మించారు. మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.