ది గోట్.. ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్

Thalapathy Vijay's The GOAT OTT Release Date Confirmed

కోలీవుడ్ స్టార్ హీరో, దళపతి విజయ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘ది గోట్ (గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్)’. వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విజయ్ డ్యూయల్ రోల్‌ ప్లే చేశాడు. స్నేహ, మీనాక్షి చౌదరి హీరోయిన్స్‌గా నటించగా ప్రశాంత్, ప్రభుదేవా, అజ్మల్, లైలా, యోగిబాబు, వీటీవీ గణేష్, జయరామ్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో కనిపించారు. భారీ అంచనాల నడుమ ఈ సినిమా సెప్టెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

యువన్ శంకర్ రాజా సంగీతం సమకూర్చగా, భారీ బడ్జెట్‍తో ఏజిఎస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించిన ఈ సినిమాను తెలుగులో ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ అందించింది. థియేటర్లలో ఆడియెన్స్ నుంచి సూపర్ రెస్పాన్స్ అందుకుని ప్రపంచవ్యాప్తంగా రూ.400కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్ల వసూళ్లు సాధించింది. అయితే ఈ మూవీ ఓటీటీ రిలీజ్‍పై మూవీ లవర్స్ చాలా ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ నుంచి ఒక కీలక అప్‌డేట్ వచ్చింది.

ది గోట్ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేెందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో మేకర్స్ అఫీషియల్ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించారు. అక్టోబర్ 3వ తేదీన ప్రముఖ ఓటీటీ ప్లాట్‍ఫామ్ నెట్‍ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్‍ కానుంది. ఈ మేరకు నెట్‍ఫ్లిక్స్ సోషల్ మీడియాలో అధికారికంగా వెల్లడించింది. ఇక ది గోట్ మాతృక తమిళం సహా తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో అందుబాటులో ఉండనుందని నెట్‍ఫ్లిక్స్ తెలిపింది. అయితే ఓటీటీ వెర్షన్ కోసం మేకర్స్ అదనంగా కొన్ని సీన్స్ యాడ్ చేయనున్నారని సమాచారం.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.