వేట్టయన్ సెన్సార్ పూర్తి, రిలీజ్‌కి రెడీ

Vettaiyan Completes Censor Formalities and Certified with U/A

కోలీవుడ్ సూపర్‌స్టార్ రజినీకాంత్‌ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం ‘వేట్టయన్‌-ది హంటర్’. ‘జై భీమ్‌’ ఫేమ్ టీజే జ్ఞానవేళ్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. దుషారా విజయన్‌, రితికా సింగ్‌ ఫీమేల్‌ లీడ్ రోల్స్‌లో నటిస్తుండగా.. బాలీవుడ్ లెజెండరీ నటుడు అమితాబ్‌ బచ్చన్‌, మాలీవుడ్ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్, ప్రముఖ మలయాళ నటి మంజు వారియర్, రానా దగ్గుబాటి, రావు రమేశ్‌, రోహిణి మొల్లేటి కీలక పాత్రలు పోషిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇప్పటికే ఈ మూవీ నుంచి లాంచ్ చేసిన టైటిల్‌ టీజర్‌ సినిమాపై సూపర్ హైప్‌ క్రియేట్ చేసింది. ఇక ఇటీవలే ఈ మూవీ నుండి ఫ‌స్ట్ సింగిల్‌ ‘మనసిలాయో’, ‘హంటర్ వంటార్’ అనే సెకండ్ సింగిల్, వేట్టయన్ తెలుగు ప్రివ్యూ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. కాగా ఈ సినిమాలో రజినీకాంత్ ఎన్‌కౌంటర్ స్పెషలిస్టుగా ఓ పవర్‌ఫుల్ రోల్‌లో కనిపించనున్నారు.

ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ నుంచి సాలిడ్ అప్డేట్ అందించింది చిత్ర బృందం. వేట్టయన్ మూవీ అన్ని సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు ఈ మూవీకి యూ/ఏ సర్టిఫికెట్ అందించింది. ఈ మేరకు మేకర్స్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఇక వేట్టయన్ ట్రైలర్ గాంధీ జయంతి సందర్భంగా రేపు విడుదలకానుంది.

కాగా లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై స్టార్ ప్రొడ్యూసర్ సుభాస్కరన్‌ నిర్మిస్తున్న వేట్టయన్‌ మూవీ దసరా కానుకగా అక్టోబరు 10న తమిళం, తెలుగు, హిందీ & కన్నడ భాషల్లో విడుదల కానుంది. మరోవైపు క్రేజీ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ‘తలైవా 171’గా తెరకెక్కుతోన్న ‘కూలి’ చిత్రంలో కూడా రజినీకాంత్ నటిస్తున్న విషయం తెలిసిందే.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.