జిగ్రా తెలుగు ట్రైలర్‌ చూశారా? అదరగొట్టిన అలియా భ‌ట్

Global Star Ram Charan Unveils Telugu Trailer of Alia Bhatt’s Jigra

సినిమాకు భాషతో, హద్దులతో సంబంధం లేదు. అందుకు ఉదాహ‌ర‌ణ‌గా నిలుస్తోంది ‘జిగ్రా’ మూవీ. ఆలియా భ‌ట్, వేదాంగ్ రైనా ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తోన్న ఈ చిత్రంపై బాలీవుడ్‌లో మంచి అంచ‌నాలున్నాయి. ఇప్పుడు ఈ అంచ‌నాలు ద‌క్షిణాదికి వ్యాపించ‌నున్నాయి. మంచి సినిమాల‌కు త‌న వంతు ఆద‌ర‌ణ‌ను ఎప్పుడూ తెలియ‌జేసే హీరో రానా ద‌గ్గుబాటి ఈ సినిమాను తెలుగులో విడుద‌ల చేయ‌టానికి సిద్ధ‌మ‌య్యారు. ఏషియ‌న్ సురేష్‌ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ ద్వారా రానా ‘జిగ్రా’ చిత్రాన్ని తెలుగులో విడుద‌ల చేస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

వ‌యాకామ్ 18 స్టూడియోస్‌, ధ‌ర్మ ప్రొడ‌క్ష‌న్స్‌, ఎట‌ర్‌న‌ల్ షైన్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్స్ స‌మ‌ర్ప‌ణ‌లో కర‌ణ్ జోహార్, అపూర్వ మెహ‌తా, ఆలియా భ‌ట్‌, షాహిన్ భ‌ట్, సోమెన్ మిశ్రా నిర్మాత‌లుగా రూపొందిన ‘జిగ్రా’ చిత్రం అక్టోబ‌ర్ 11న ప్ర‌పంచ వ్యాప్తంగా భారీగా విడుద‌ల‌వుతుంది. అయితే ఇప్ప‌టికే ఈ సినిమా హిందీ ట్రైల‌ర్ విడుద‌లై అంచ‌నాల‌ను పెంచిన సంగ‌తి తెలిసిందే.

ఈ నేపథ్యంలో తాజాగా జిగ్రా తెలుగు థియేట్రికల్ ట్రైల‌ర్‌ను రిలీజ్ చేసింది చిత్ర బృందం. గ్లోబ‌ల్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌ చేతుల మీదుగా దీనిని విడుద‌ల చేయడం విశేషం. ఈ ట్రైలర్ గమనిస్తే.. జిగ్రా అనేది కేవ‌లం యాక్ష‌న్ చిత్రం మాత్ర‌మే కాదు.. కుటుంబంలోని అనుబంధాల‌ను తెలియ‌జేసేలావుంది. మ‌నం ఎంతగానో ప్రేమించే వ్య‌క్తుల‌ను మనం ఎలా కాపాడుకోవాలో తెలియ‌జెప్తుంది.

జిగ్రా క‌థ‌లో మంచి సోల్ ఉంది. ఆలియా భ‌ట్‌, వేదాంగ్ రైనా మధ్య అనుబంధాన్ని చక్కగా ఆవిష్కరించారు. తెలుగు ప్రేక్ష‌కుల‌కు సుప‌రిచితురాలైన ఆలియా భ‌ట్‌తో పాటు వేదాంగ్ రైనా అద్భుతమైన న‌ట‌న ప్రేక్ష‌కుల‌కు ఓ గొప్ప సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్‌ను అందించ‌నుంది. భాష‌తో, స‌రిహ‌ద్దుల‌తో సంబంధం లేకుండా ఎవ‌రికైనా ఇది క‌నెక్ట్ అవుతుంది. ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న ప్రేక్ష‌కుల‌కు అద్భుత‌మైన అనుభవాన్ని అందిస్తుంద‌న‌టంలో సందేహం లేదు.

కాగా జిగ్రా సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. న‌టిగా అలియా వైవిధ్య‌మైన పాత్ర‌ల‌తో ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తూ తిరుగులేని విజ‌యాల‌ను త‌న ఖాతాలో వేసుకుంటున్నారు. బ్ర‌హ్మాస్త్ర పార్ట్ 1- శివ‌, ఆర్ఆర్ఆర్ వంటి చిత్రాల‌తో తెలుగు ఆడియెన్స్‌ను అల‌రించిన ఈమె ఇప్పుడు జిగ్రాతో మ‌న‌సుల‌ను గెలుచుకోడానికి సిద్ధ‌మ‌వుతోంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఎన్న‌డూ చూడ‌న‌టువంటి ఓ స‌రికొత్త యాక్షన్ ప్యాక్డ్ రోల్‌లో ఆమెను ఆడియెన్స్ చూడ‌బోతున్నారు.

ఇక ధ‌ర్మ ప్రొడ‌క్ష‌న్స్ సమ‌ర్ప‌ణ‌లో విడుద‌లైన బాహుబ‌లి ఫ్రాంచైజీ పాన్ ఇండియా బ్లాక్ బ‌స్ట‌ర్‌ను సాధించిన సంగ‌తి తెలిసిందే. అదే జోరుని ఘాజీ ఎటాక్‌తోనూ ఈ సంస్థ కొన‌సాగించింది. తాజాగా ఎన్టీఆర్‌, జాన్వీ క‌పూర్ జంట‌గా న‌టించిన దేవ‌ర పార్ట్‌1ను కూడా హిందీలో విడుద‌ల చేసిందీ సంస్థ‌. అలాగే ఇప్పుడు అలియా, ధ‌ర్మ ప్రొడ‌క్ష‌న్స్ క‌లయిక‌లో వ‌స్తోన్న ఈ చిత్రం ఓ మైల్‌స్టోన్ మూవీగా నిల‌వ‌నుందని అభిమానులు అంచనా వేస్తున్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.