లోక నాయకుడు కమల్ హాసన్ హీరోగా నటిస్తోన్న క్రేజీ ప్రాజెక్ట్ ‘థగ్ లైఫ్’. లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వం వహిస్తున్నారు. కాగా పొన్నియిన్ సెల్వన్ 2 తరువాత లెజండరీ డైరెక్టర్ మణిరత్నం నుండి వస్తున్న సినిమా ఇదే. ఈ మూవీలో ఐశ్వర్య లక్ష్మి, త్రిష ఫీమేల్ లీడ్ రోల్స్‌లో నటిస్తుండగా.. యంగ్ హీరోలు శింబు, గౌతమ్ కార్తీక్, అశోక్ సెల్వన్ మరియు పాపులర్ మాలీవుడ్ యాక్టర్ జోజు జార్జ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రం నుండి కీలక అప్‌డేట్ వచ్చింది. థగ్ లైఫ్ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ మేరకు మేకర్స్ సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించింది. ఇక ఇదిలావుంటే, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులపై యూనిట్ దృష్టి సారించింది. వీటిని వీలైనంత త్వరగా ముగించి ఈ ఏడాది చివరిలో సినిమాను విడుదలచేసేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
కాగా థగ్ లైఫ్ సినిమాను రెడ్ జెయింట్ మూవీస్ బ్యానర్‌పై ఉదయనిధి స్టాలిన్ సమర్పణలో రాజ్ కమల్ ఫిలింస్ ఇంటర్నేషనల్, మద్రాస్ టాకీస్ బ్యానర్స్‌పై కమల్, ఆర్ మహేంద్రన్, మణిరత్నం, శివ అనంత్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డ్ విన్నింగ్ మ్యూజిక్ కంపోజర్ ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా.. రవి కె చంద్రన్ సినిమాటోగ్రాఫర్‌గా.. శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























