యంగ్ హీరో కిరణ్ అబ్బవరం భారీ పీరియాడిక్ థ్రిల్లర్ క సినిమా షూటింగ్ నేటితో కంప్లీట్ అయ్యింది.మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి.నవంబర్ లో థియేటర్లోకి తీసుకొచ్చేలా ప్లాన్ చేస్తున్నారు.రీసెంట్ గా ఈసినిమా నుండి వచ్చిన టీజర్,ఫస్ట్ సాంగ్ కి హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది.దాంతో సినిమాపై అంచనాలను మొదలయ్యాయి.థియేట్రికల్ రైట్స్ కూడా ఫుల్ డిమాండ్ వస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
తెలుగు లో ఈసినిమాను నిర్మాత వంశీ నందిపాటి రిలీజ్ చేస్తుండగా మలయాళ థియేట్రికల్ రైట్స్ ను స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ ప్రొడక్షన్ కంపెనీ వేఫరర్ ఫిలింస్ సొంతం చేసుకుంది.అక్కడ ఈ సంస్థ గ్రాండ్ రిలీజ్ చేయనుంది.కిరణ్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో వస్తున్న ఈసినిమా రిలీజ్ కుముందే సేఫ్ అవ్వనుంది.సుజిత్,సందీప్ డైరెక్ట్ చేస్తున్న ఈసినిమాలో ఆయ్ ఫేమ్ నయన్ సారిక అలాగే తన్వీ రామ్ హీరోయిన్స్ గా నటించారు.సామ్ సీఎస్ సంగీతం అందిస్తుండగా చింతా గోపాలకృష్ణ రెడ్డి నిర్మిస్తున్నాడు.
ఇక ఈసినిమాతో ఎలాగైనా హిట్ కొట్టి ఫామ్ లోకి రావాలని కిరణ్ అబ్బవరం పట్టుదలతో వున్నాడు.కెరీర్ స్టార్టింగ్ లో వరుస విజయలతో దూసుకెళ్లిన కిరణ్ ఆ తరువాత వరస పరాజయాలను చవిచూశాడు.దాంతో క విజయం తప్పనిసరి కానుంది.ఈసినిమా పై కిరణ్ ఫుల్ కాన్ఫిడెంట్ గా వున్నాడు.మరి క,కిరణ్ కు విజయాన్ని అందిస్తుందో చూడాలి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























