దేవర.. తెలంగాణలో టికెట్ల పెంపు, మిడ్ నైట్ షోలకు అనుమతి

Devara Telangana Govt Gives Green Signal To Tickets Rate Hike and Mid Night Shows

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ టైటిల్ రోల్‌ పోషించగా, కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వం వహించిన లేటెస్ట్ మూవీ ‘దేవర’. రెండు భాగాలుగా రూపొందుతోన్న ఈ మోస్ట్ అవైటెడ్ మూవీలో తారక్ సరసన బాలీవుడ్ స్టార్ హీరోయిన్‌ జాన్వీ క‌పూర్ కథానాయికగా కనిపించనుంది. ప్ర‌పంచ వ్యాప్తంగా సెప్టెంబ‌ర్ 27న దేవ‌ర చిత్రం తెలుగు, హిందీ, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌లయాళ భాష‌ల్లో గ్రాండ్‌గా రిలీజ్ అవుతోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇప్ప‌టికే దేవ‌ర సినిమాకు ఆంధ్రప్రదేశ్ ప్ర‌భుత్వం టికెట్ రేట్ల పెంపున‌కు అనుమ‌తి ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా తెలంగాణ ప్రభుత్వం కూడా దేవ‌రకు గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణలో ఈ సినిమా టికెట్ల రేట్ల పెంపుద‌ల‌కు మరియు ప్ర‌త్యేక షోల‌కు అనుమ‌తిని ఇస్తూ జీవో జారీ చేసింది. దీనిప్రకారం, సెప్టెంబరు 27న 29 థియేటర్ల‌లో మిడ్ నైట్ 1గం.కు బెనిఫిట్ షోలకు అనుమతినిచ్చింది.

అలాగే ఉదయం 4 గంటలకు రాష్ట్రంలోని అన్ని థియేటర్ల‌లో స్పెషల్ షోస్‌కు ప‌ర్మిష‌న్ ఇచ్చింది. దీనితోపాటు టికెట్ పై రూ.100 పెంపునకు ఆమోదం తెలిపింది. అంతేగాక 9 రోజుల పాటు అంటే.. సెప్టెంబరు 28 నుంచి అక్టోబర్ 6 వరకు ఐదవ షోలు వేసుకునేందుకు అనుమతి ఇచ్చింది. తాజా సమాచారం ప్రకారం, సింగిల్ స్క్రీన్ టికెట్ రేట్లపై రూ.25 , మల్టీప్లెక్స్‌ల‌లో టికెట్ రేట్లపై రూ.50లు పెరగనున్నాయి.

ఇక దీనిపై హీరో ఎన్టీఆర్ స్పందించారు. దేవర చిత్రానికి ప్రత్యేక అనుమతులు ఇచ్చినందుకుగానూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సోషల్ మీడియా వేదికగా కృతజ్ఞతలు తెలిపారు. సీఎంతోపాటు తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కూడా తారక్ ధన్యవాదాలు తెలియజేశారు. తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఇంతటి మద్దతు ఇస్తున్నందుకు వారికీ ఋణపడి ఉంటాను అని ఆయన అందులో పేర్కొన్నారు.

కాగా దేవర చిత్రంలో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ ‘భైరా’ అనే విలన్‌ పాత్రలో కనిపించనుండగా.. అలాగే ప్ర‌కాష్ రాజ్‌, శ్రీకాంత్‌, షైన్ టామ్ చాకో, అజ‌య్, గెట‌ప్ శీను త‌దిత‌రులు ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ స‌మ‌ర్ప‌ణ‌లో ఎన్టీఆర్ ఆర్ట్స్‌, యువ సుధ ఆర్ట్స్ ప‌తాకాల‌పై మిక్కిలినేని సుధాక‌ర్‌, హ‌రికృష్ణ‌.కె నిర్మించారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.