గేమ్ ఛేంజర్ సెకండ్ సింగిల్‌ అప్‌డేట్ ఇచ్చిన థమన్

Music Director S Thaman Gives Interesting Update on Game Changer Second Single

గ్లోబల్ స్టార్‌ రామ్ చరణ్ హీరోగా నటిస్తోన్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ ‘గేమ్ ఛేంజర్’. పొలిటికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీకి కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఆయన సరసన కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. శ్రీకాంత్, ఎస్‌జే సూర్య, జయరామ్, సునీల్‌, అంజలి, నవీన్ చంద్ర తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

చరణ్ 15వ చిత్రంగా రూపొందుతోన్న ఈ చిత్రంలో మెగా పవర్ స్టార్ డిఫరెంట్ పాత్రలో కనిపించనున్నారు. ఇక గేమ్ ఛేంజర్‌లో తన పాత్రకు సంబంధించి రామ్ చరణ్ షూటింగ్ కంప్లీట్ చేశాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన ఫస్ట్ సింగిల్ ‘జరగండి’ సహా టోటల్ ప్రమోషనల్ కంటెంట్ హ్యూజ్ రెస్పాన్స్ అందుకుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రం నుంచి ఓ కీలక అప్‌డేట్ అందింది.

సోషల్ మెసేజ్‍తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఎస్. థమన్ సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే థమన్ మాట్లాడుతూ.. గేమ్ ఛేంజర్ బ్యాక్‍ గ్రౌండ్ మ్యూజిక్ స్కోర్ పనులు అక్టోబర్ 1వ తేదీన మొదలవనున్నాయని, అలాగే వచ్చే వారం నుంచి ఈ మూవీ నుంచి అన్‍స్టాపబుల్ ఈవెంట్స్ ఉండనున్నాయని చెప్పిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో తాజాగా ఆయన గేమ్ ఛేంజర్ సెకండ్ సింగిల్‌పై ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఇచ్చారు. దీనికి సంబంధించి రేపు ఉదయం 11 గంటల 11 నిమిషాలకు పూర్తి వివరాలు వెల్లడించనున్నట్టు ఆయన తెలిపారు. దీంతో చెర్రీ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఈ వారం చివరిలో కానీ, నెలాఖరుకి కానీ సెకండ్ సింగిల్ రావొచ్చని వారు భావిస్తున్నారు.

కాగా పాన్ ఇండియా సినిమాగా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యానర్‌పై టాలీవుడ్ అగ్ర నిర్మాతలు దిల్ రాజు, శిరీష్‌లు అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. డిసెంబర్ 20వ తేదీన క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా గేమ్ ఛేంజర్ ఎంటైర్ ఓవర్సీస్‌ రిలీజ్ రైట్స్‌ను ‘ఫార్స్ ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్’ సొంతం చేసుకుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.