పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు శుభవార్త. ఆయన హీరోగా నటిస్తోన్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘హరిహర వీరమల్లు పార్ట్-1 స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’ షూటింగ్ ఈరోజు పునఃప్రారంభం అయింది. వెండితెరపై ప్రేక్షకులకు మరపురాని అనుభూతిని అందించాలనే ఉద్దేశంతో, నిర్మాతలు కూడా ఎక్కడా రాజీ పడకుండా భారీస్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ నేపథ్యంలో నేటినుంచి విజయవాడలో కొత్త షెడ్యూల్ మొదలైంది. ఈ కీలకమైన విజయవాడ షెడ్యూల్‌తో సినిమా చిత్రీకరణ తుదిదశకు చేరుకుంటుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సందర్భంగా మేకర్స్ హరిహర వీరమల్లు విడుదల తేదీని ప్రకటించి పవన్ ఫ్యాన్స్‌కు మరో గుడ్ న్యూస్ వినిపించారు. వచ్చే ఏడాది మార్చి 28న ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేయనున్నట్టు తెలిపారు. ఈ మేరకు నేడు సోషల్ మీడియా వేదికగా వారు వెల్లడించారు. ఇక రిలీజ్ డేట్ రావడంతో అభిమానుల్లో జోష్ పెరిగింది. ఇందులో పవర్ స్టార్ ఫస్ట్ టైం ఒక వారియర్‌గా కనిపిస్తున్న విషయం తెలిసిందే.
ఇక సుదీర్ఘ విరామం తర్వాత ఆయనతో కలిసి పనిచేయడానికి నటీనటులు, సాంకేతిక సిబ్బంది ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. కాగా ఈ మూవీ కోసం హాలీవుడ్ దిగ్గజ యాక్షన్ డైరెక్టర్ నిక్ పావెల్ పనిచేయనుండటం విశేషం. ఈ షెడ్యూల్‌లో ఆయన ఆధ్వర్యంలో భారీ యుద్ధ సన్నివేశం చిత్రీకరించబోతున్నారు. ఈ యాక్షన్ సీక్వెన్స్ సినిమాకే హైలైట్‌గా ఉంటుందని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి.
నిక్ పావెల్ తన అసాధారణ నైపుణ్యంతో హరి హర వీర మల్లు యుద్ధ సన్నివేశాలను అద్భుతంగా తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ భారీ యుద్ధ సన్నివేశాలను 400 మంది సిబ్బందితో పాటు భారీ సంఖ్యలో జూనియర్ ఆర్టిస్టులు, ఫైటర్లతో చిత్రీకరించనున్నారు. సీనియర్ నటులు నాజర్, రఘుబాబుతో పాటు సునీల్, అభిమన్యు సింగ్, అయ్యప్ప వంటి నటులు కూడా ఈ చిత్రీకరణలో భాగం కానున్నారు.
దిగ్గజ నిర్మాత ఏఎం రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఎ. దయాకర్ రావు అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రంలో నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తుండగా, బాలీవుడ్ నటులు బాబీ డియోల్, అనుపమ్ ఖేర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రముఖ ఛాయగ్రాహకుడు మనోజ్ పరమహంస కెమెరా బాధ్యతలు నిర్వహిస్తుండగా, దిగ్గజ కళా దర్శకుడు తోట తరణి ఈ చిత్రం కోసం అద్భుతమైన సెట్ లను రూపొందిస్తున్నారు. ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























