ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ టైటిల్ రోల్‌లో నటిస్తోన్న ఇండియాస్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘పుష్ప 2: ది రూల్’. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్టుపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలున్నాయి. ఈ మూవీ ‘పుష్ప-ది రైజ్’కి సీక్వెల్‌గా రూపొందుతోన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటోన్న ఈ చిత్రం నుంచి రిలీజైన గ్లింప్స్, టీజర్, సాంగ్స్ సహా ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై మంచి బజ్ పెంచేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ నేపథ్యంలో పుష్ప 2 రిలీజ్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన భాషల్లో రిలీజ్ కానున్న ఈ చిత్రం డిసెంబర్ 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్రం విడుదలకు 100 రోజుల కౌంట్‌డౌన్ స్టార్ట్ చేసింది మూవీ యూనిట్. ఈ క్రమంలో మూవీ నుంచి ఒక ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ వచ్చింది.
పుష్ప 2 విడుదలకు ఇంకా 75 రోజులే సమయం ఉండటంతో తాజాగా స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసింది. ఈ మేరకు సోషల్ మీడియాలో తెలిపిన చిత్ర యూనిట్.. మరో 75 రోజుల్లో పుష్ప 2 థియేటర్లలోకి వచేస్తుందని పేర్కొంది. ఇక ఈ పోస్టర్‌లో అల్లు అర్జున్ అదిరిపోయే లుక్‌లో కనిపిస్తున్నాడు. ఒక చేయి కిందకు వంచి మరోసారి తన స్టైల్ ఆఫ్ స్వాగ్‌తో అలరించాడు. ఈ పోస్టర్ మూవీపై అంచనాలను మరింతగా పెంచేలావుంది.
కాగా ‘పుష్ప 2’ చిత్రంలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా కథానాయికగా నటిస్తుండగా.. సునీల్, రావు రమేష్, అనసూయ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. అలాగే ప్రముఖ మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ ప్రతినాయకుడిగా చేస్తుండగా.. టాలీవుడ్ సీనియర్ నటులు జగపతి బాబు, రాజేంద్ర ప్రసాద్ ముఖ్య పాత్రలలో కనిపించనున్నారు. టాలీవుడ్ అగ్ర చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ మరియు డైరెక్టర్ హోం బ్యానర్ సుకుమార్ రైటింగ్స్ కలిసి సంయుక్తంగా ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాయి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: