విక్టరీ వెంకటేష్, బ్లాక్ బస్టర్ మెషిన్ అనిల్ రావిపూడి కాంబోలో మూడో చిత్రం తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ఈ మూవీ ప్రతిష్టాత్మకంగా రూపొందుతోంది. తాజాగా ఈ సినిమా నుంచి ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ అందింది. గత కొన్ని రోజులుగా పొల్లాచ్చిలో షూటింగ్ జరుపుకుంటోన్న ఈ చిత్రం ఈ లాంగ్ షెడ్యూల్ పూర్తి చేసుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
నెల రోజులకు పైగా సాగిన లెన్తీ షెడ్యూల్‌లో, మేకర్స్ లీడ్ యాక్టర్స్ పై, పాటలు, యాక్షన్ పార్ట్‌తో కూడిన కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ నేపథ్యంలో తదుపరి షెడ్యూల్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. ఈ క్రమంలో సెట్స్ లోకి అనుకోని అతిథి రావడంతో అంతా ఆశ్చర్యపోయారు. ఆ అతిథి మరెవరో కాదు నటసింహం నందమూరి బాలకృష్ణ.
తాజాగా ఆయన వెంకీఅనిల్ 3 మూవీ సెట్స్‌ని సందర్శించారు. ఈ సందర్భంగా బాలయ్య హీరో వెంకటేష్, డైరెక్టర్ అనిల్ రావిపూడిలతో కలిసి సరదాగా మాట్లాడారు. అఞ్ఞతరం ముగ్గురూ కలిసి ఫోటోలకు ఫోజులిచ్చారు. కాగా ఈ ఫోటోలను మేకర్స్ సోషల్ మీడియాలో షేర్ చేయగా, ప్రస్తుతం అవి నెట్టింట వైరల్ అవుతున్నాయి.
దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్న ఈ ట్రయాంగిల్ క్రైమ్ డ్రామాకి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ, ఏఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్, తమ్మిరాజు ఎడిటింగ్ నిర్వహిస్తున్నారు. ఎస్ కృష్ణ, జి ఆదినారాయణ కో -రైటర్స్. వి వెంకట్ యాక్షన్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు.
ఇక ఈ సినిమాలో వెంకటేష్ సరసన మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ కథానాయికలుగా నటిస్తుండగా.. ఉపేంద్ర లిమాయే, రాజేంద్ర ప్రసాద్, సాయి కుమార్, నరేష్, VT గణేష్, మురళీధర్ గౌడ్, పమ్మి సాయి, సాయి శ్రీనివాస్, ఆనంద్ రాజ్, చైతన్య జొన్నలగడ్డ, మహేష్ బాలరాజ్, ప్రదీప్ కాబ్రా, చిట్టి తదితరులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:


























