నటసామ్రాట్, పద్మవిభూషణ్ క్కినేని నాగేశ్వరరావు గారి శత జయంతి వేడుకలు నిన్న ఘనంగా ఆరంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆయన పేరుపై స్పెషల్ పోస్టల్ స్టాంప్ రిలీజ్ చేశారు. ఇక ఏఎన్నార్ శత జయంతిని పురస్కరించుకుని ఫిల్మ్ హెరిటేజ్ ఫౌండేషన్ NFDC-నేషనల్ ఫిల్మ్ ఆర్కైవ్ ఆఫ్ ఇండియాతో కలిసి ‘ANR 100 – కింగ్ ఆఫ్ ది సిల్వర్ స్క్రీన్’ ఫిల్మ్ ఫెస్టివల్‌ని నిర్వహిస్తోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ నేపథ్యంలో అభిమానులు, కుటుంబ సభ్యుల సమక్షంలో ఏఎన్నార్ ఐకానిక్ ఫిలిం ‘దేవదాసు’ స్క్రీనింగ్ తో ఈ ఫెస్టివల్ శుక్రవారం గ్రాండ్ గా ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఏఎన్నార్ తనయుడు, హీరో నాగార్జున ఒక ఇంట్రెస్టింగ్ విషయాన్ని పంచుకున్నారు. ఈ ఏడాది ఏఎన్ఆర్ అవార్డ్ ను మెగాస్టార్ చిరంజీవికి అందిస్తున్నట్టు తెలిపారు.
దీనిప్య ఆయన మాట్లాడుతూ.. “ప్రతి రెండేళ్ళకు ఏఎన్ఆర్ అవార్డ్ ఇస్తున్నాం. ఈ ఏడాది ఏఎన్ఆర్ అవార్డ్ చిరంజీవి గారికి ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. ఈ విషయం చెప్పగానే చిరంజీవి గారు చాలా ఎమోషనల్ హాగ్ చేసుకొని ఏఎన్ఆర్ గారి శత జయంతి ఏడాదిలో ఇవ్వడం చాలా ఆనందంగా వుందని చెప్పారు. దీనికి కంటే పెద్ద అవార్డ్ లేదని అన్నారు. అమితాబ్ బచ్చన్ గారు ఆవార్డ్ ప్రధానం చేస్తారు. అక్టోబర్ 28 ఈ ఫంక్షన్ చేస్తున్నాం. అందరికీ ధన్యవాదాలు” అని తెలిపారు నాగార్జున.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: