కోలీవుడ్ సూపర్‌స్టార్ రజినీకాంత్ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘వేట్టైయాన్’. తలైవా 170గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ‘జై భీమ్’ ఫేమ్ టీజే జ్ఞానవేళ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుంచి లాంచ్ చేసిన టైటిల్ టీజర్ సినిమాపై సూపర్ హైప్ క్రియేట్ చేసింది. దుషారా విజయన్, రితికా సింగ్ ఫీమేల్ లీడ్ రోల్స్‌లో నటిస్తుండగా.. బాలీవుడ్ లెజెండరీ నటుడు అమితాబ్ బచ్చన్, మాలీవుడ్ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
రానా దగ్గుబాటి, రావు రమేశ్, రోహిణి మొల్లేటి ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. అలాగే ప్రముఖ మలయాళ నటి మంజు వారియర్ ఓ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ఇటీవలే ఈ మూవీ నుండి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. సాంగ్ అయితే అదిరిపోయింది. ఇందులో సూపర్ స్టార్ తన స్టైల్ స్వాగ్‌తో అలరించారు. ఈ నేపథ్యంలో తాజాగా వేట్టైయాన్ నుంచి మరో సాంగ్ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్.
హంటర్ వంటార్ అంటూ సాగే ఈ సెకండ్ సింగిల్ సూపర్బ్ గా ఉంది. మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ మరియు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్న విషయం తెలిసిందే. అనిరుధ్ మరోసారి తన గ్రేస్ చూపించాడు. అయితే ఇది కేవలం ఆడియో రూపంలో మాత్రమే అందుబాటులో ఉంది. రజిని ప్రీవియస్ మూవీ జైలర్ కి కూడా అనిరుధ్ నెక్స్ట్ లెవెల్లో మ్యూజిక్ అందించిన విషయం తెలిసిందే.
కాగా లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై స్టార్ ప్రొడ్యూసర్ సుభాస్కరన్ నిర్మిస్తున్న వేట్టైయాన్ మూవీ దసరా కానుకగా అక్టోబరు 10న తమిళం, తెలుగు, హిందీ & కన్నడ భాషల్లో విడుదల కానుంది. ఇక ఇదిలావుంటే, మరోవైపు క్రేజీ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ‘తలైవా 171’గా తెరకెక్కుతోన్న ‘కూలి’ చిత్రంలో కూడా రజినీకాంత్ నటిస్తున్న విషయం తెలిసిందే.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























