మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ టైటిల్ రోల్ పోషించగా, కొరటాల శివ దర్శకత్వం వహించిన లేటెస్ట్ మూవీ ‘దేవర’. రెండు భాగాలుగా రూపొందుతోన్న ఈ మోస్ట్ అవైటెడ్ మూవీలో తారక్ సరసన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ కథానాయికగా కనిపించనుంది. ప్రపంచ వ్యాప్తంగా సెప్టెంబర్ 27న దేవర చిత్రం తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్ రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ బిజీబిజీగా మూవీ ప్రమోషన్స్‌లో పాల్గొంటున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ క్రమంలో తారక్ టాలీవుడ్ యంగ్ హీరోలు స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ మరియు విశ్వక్ సేన్ లతో ఓ ఇంటర్వ్యూ చేశారు. తాజాగా ఈ ఇంటర్వ్యూకి సంబంధించిన పూర్తి వీడియోను రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో సిద్దు, విశ్వక్ ఇద్దరూ ఎన్టీఆర్ తో సరదాగా జోకులు వేస్తూ దేవర విశేషాలు పంచుకున్నారు. ప్రస్తుతం ఈ ఇంటర్వ్యూ ట్రెండింగ్‌లో ఉంది. ఇంకెందుకు ఆలస్యం.. మీరూ ఓ లుక్కేయండి.
కాగా దేవర చిత్రంలో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ ‘భైరా’ అనే విలన్ పాత్రలో కనిపించనుండగా.. అలాగే ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, షైన్ టామ్ చాకో, అజయ్, గెటప్ శీను తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు. నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధ ఆర్ట్స్ పతాకాలపై మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ.కె నిర్మించారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: