టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ రూపొందించిన యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ‘మ్యాడ్’ చిత్రం గతేడాది అక్టోబరులో విడుదలై ఎంతటి ఘనవిజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆ బ్లాక్‌బస్టర్ చిత్రానికి సీక్వెల్‍గా ‘మ్యాడ్ స్క్వేర్’ అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ యేడాది ఉగాది శుభ సందర్బంగా చిత్ర బృందం పూజా కార్యక్రమాలతో ఈ సినిమాను లాంఛనంగా ప్రారంభించిన విషయం గుర్తుండేవుంటుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
మ్యాడ్ లో నటించి మెప్పించిన యువ కథానాయకులు నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్‌ల త్రయం ఈ సీక్వెల్ కోసం మళ్ళీ రంగంలోకి దిగారు. తొలిభాగానికి దర్శకత్వం వహించిన కళ్యాణ్ శంకర్ ఈ మ్యాడ్ స్క్వేర్ మూవీకి కూడా డైరెక్షన్ చేస్తున్నాడు. ‘మ్యాడ్’తో రచయిత-దర్శకుడిగా పరిచయమైన ఆయన, సితార సంస్థ నిర్మించిన మరో భారీ బ్లాక్‌బస్టర్ మూవీ ‘టిల్ స్క్వేర్’కి రచయితలలో ఒకరిగా పనిచేయడం గమనార్హం.
ప్రస్తుతం ఈ మూవీ చిత్రీకరణ శరవేగంగా సాగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా మేకర్స్ మ్యాడ్ స్క్వేర్ నుండి ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌లో ముగ్గురు హీరోలు సంప్రదాయ తెలుగు పంచెకట్టులో కనిపించి సందడి చేశారు. ఇక ఈ పోస్టర్‌తోపాటు ఫస్ట్ సింగిల్ అనౌన్స్‌మెంట్ కూడా ఇచ్చేశారు. మరో రెండు రోజుల్లో అంటే, సెప్టెంబర్ 20న ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో అధికారికంగా వెల్లడించారు.
ఇక మ్యాడ్ సినిమాకు పని చేసిన సాంకేతిక నిపుణుల బృందం మ్యాడ్ స్క్వేర్ కోసం కూడా చేతులు కలిపింది. భీమ్స్ సిసిరోలియో సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రానికి షామ్‌దత్ కెమెరా బాధ్యతలు నిర్వహిస్తుండగా, నవీన్ నూలి ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్‌తో కలిసి సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై హారిక సూర్యదేవర, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తుండగా.. ప్రముఖ నిర్మాత సూర్యదేవ నాగవంశీ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు.
ఇక ఇందులో నటించనున్న కథానాయికల వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు. ఇక ఈ సందర్భంగా ‘మ్యాడ్ నెస్ ఇంకా పూర్తి కాలేదు.. ఈసారి డబుల్ మ్యాడ్ నెస్ ఉంటుందని, ఈ సీక్వెల్‌తో ప్రేక్షకులకు థియేటర్లలో మ్యాడ్ మ్యాక్స్ వినోదాన్ని అందిస్తామని పేర్కొన్నారు మేకర్స్. మ్యాడ్ ఎంతలా నవ్వులు పంచిందో, దానికి రెట్టింపు వినోదం సీక్వెల్ ద్వారా అందించబోతున్నట్టు తెలిపారు.
‘డీజే టిల్లు’కి సీక్వెల్‍గా రూపొందిన ‘టిల్లు స్క్వేర్’ ఎంతటి సంచలన విజయాన్ని సాధించిందో.. ‘మ్యాడ్’కి సీక్వెల్‍గా రూపొందుతోన్న ‘మ్యాడ్ స్క్వేర్’ కూడా అంతటి విజయాన్ని సాధిస్తుందని నిర్మాతలు నమ్మకంగా ఉన్నారు. దీనిని బట్టి చూస్తే, ఈసారి కథానాయికల త్రయం చేసే అల్లరి.. థియేటర్లలో నవ్వుల సునామీ సృష్టించనుందని అర్థమవుతోంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























