టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో సందీప్ కిషన్ తెలుగులో ‘ఊరు పేరు భైరవకోన’ సంచలన విజయం సాధించగా, తమిళంలో ‘కెప్టెన్ మిల్లర్’, ‘రాయన్’ చిత్రాలతో వరుస విజయాలను అందుకున్నారు. ఇలా బ్యాక్ టు బ్యాక్ హిట్స్‌తో దూసుకుపోతున్న ప్రస్తుతం సందీప్ కిషన్ తెలుగు, తమిళం రెండింటిలో అనేక అద్భుతమైన ప్రాజెక్ట్‌లు చేస్తున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా సందీప్ కిషన్ తమిళ చిత్రాలైన కెప్టెన్ మిల్లర్, రాయన్‌లలో తన పాత్రలకు ప్రశంసలు అందుకున్నారు. కెప్టెన్ మిల్లర్‌లో కెప్టెన్‌గా పవర్ ఫుల్ పాత్ర పోషించారు, రాయన్‌లో డార్క్ అండ్ కాంప్లెక్స్ క్యారెక్టర్ లో ఆదరగొట్టారు. ఇంత కాంపిటేషన్ వున్న దక్షిణాది సినిమాల్లో ఒక తెలుగు యాక్టర్ ఇన్ని ప్రశంసలు, అవార్డును సాధించడం చాలా రేర్.
ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (సైమా)లో సందీప్ కిషన్ ఓ స్పెషల్ అవార్డ్ సొంతం చేసుకున్నారు. సౌత్ ఇండియాలో ‘రైజింగ్ స్టార్’ అనే అవార్డును సొంతం చేసుకున్నారు. దీంతో ఆయనకు టాలీవుడ్ సహా అన్ని చిత్ర పరిశ్రమల నుండి అభినందనలు అందుతున్నాయి.
కాగా ప్రతిష్టాత్మక సైమా అవార్డ్స్ (సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్) 2024 వేడుకలు దుబాయ్‌లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ వేదికగా ఘనంగా జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తొలిరోజు సెప్టెంబర్ 14న తెలుగు, కన్నడ సినిమాలకు సంబంధించి పురస్కారాలు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో టాలీవుడ్ నుంచి హీరోలు విజయ్ దేవరకొండ, రానా దగ్గుబాటి, నిర్మాతలు అల్లు అరవింద్, టీజీ విశ్వప్రసాద్ వేడుకలో అతిధులుగా పాల్గొన్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























