సక్సెస్‌ఫుల్‌ కాంబోలో కార్తీ 29

Karthi's 29th Film Announced With Director Tamizh and Dream Warrior Pictures

కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ అద్భుతమైన కథలతో, ఎక్స్ ట్రార్డినరీ పెర్ఫార్మెన్స్‌తో ప్రేక్షకులని అలరిస్తూ తమిళంలోనే కాకుండా తెలుగులోనూ మంచి స్టార్‌డమ్ తెచ్చుకున్నాడు. తాజాగా ఆయన కథానాయకుడిగా ఓ పీరియాడికల్ ఫిల్మ్ భారీ స్థాయిలో తెరకెక్కనుంది. ఈ ప్రాజెక్టును ప్రముఖ కోలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ నిర్మించనుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

డ్రీమ్ వారియర్ పిక్చర్స్ ‘ధీరన్ అధిగారం ఒండ్రు’, ‘అరువి’, ‘ఖైదీ’, ‘ఒకే ఒక జీవితం’, ‘ఫర్హానా’.. వంటి ప్రతిష్టాత్మక సినిమాలతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది. తాజాగా దీనికి సంబంధించి అనౌన్స్‌మెంట్‌ వచ్చేసింది. కార్తీ, డ్రీమ్ వారియర్ పిక్చర్స్ తమ నెక్స్ట్ ప్రాజెక్ట్‌గా #కార్తీ 29 సినిమాను ఎంచుకుంది. ఇక దీనికి దర్శకత్వం వహించడానికి టాలెంటెడ్ డైరెక్టర్ తమిళ్‌ని ఎంచుకున్నారు.

కాగా డైరెక్టర్ తమిళ్ విమర్శకుల ప్రశంసలు పొందిన ‘తానా అక్కరన్‌’తో మూవీతో అందరినీ ఆకట్టుకున్నారు. ఎస్ఆర్ ప్రకాష్‌బాబు, ఎస్ఆర్ ప్రభు నేతృత్వంలోని డ్రీమ్ వారియర్ పిక్చర్స్, కార్తీ కలిసి తీరన్ అధిగారం ఒండ్రు, ఖైదీ, సుల్తాన్ వంటి క్లాసిక్ బ్లాక్‌బస్టర్‌లను అందించడంతో పాటు కాష్మోరా, జపాన్ వంటి ప్రయోగాత్మక చిత్రాలతో అలరించారు.

ఇప్పుడు మరోసారి వీరి కాంబినేషన్‌లో వస్తోన్న ఈ సినిమాపై భారీ అంచనాలే వున్నాయి. ఇక మాగ్నమ్ ఓపస్ #కార్తీ29ని డ్రీమ్ వారియర్ పిక్చర్స్‌తో పాటు, ఇషాన్ సక్సేనా, సునీల్ షా, రాజా సుబ్రమణియన్ నేతృత్వంలోని ఐవీ ఎంటర్‌టైన్‌మెంట్, B4U మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తాయి.

ఇక ఈ సినిమాను 2025లో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్న ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ వర్క్స్ స్టార్ట్ చేశారు మేకర్స్. #కార్తీ29 ఇతర తారాగణం, టెక్నికల్ టీం అప్‌డేట్‌లను ప్రొడక్షన్ హౌస్ త్వరలో తెలియజేయనున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.