నటీనటులు : రాజ్ తరుణ్ ,మనీషా ,అభిరామి,హైపర్ ఆది
ఎడిటింగ్ : శ్రీకాంత్ పట్నాయక్
సినిమాటోగ్రఫీ : నగేష్ బానెల్ల
సంగీతం : శేఖర్ చంద్ర
దర్శకత్వం : శివ సాయి వర్ధన్
నిర్మాతలు : ఎన్ వి కిరణ్ కుమార్
సమర్పణ : మారుతి
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
రీసెంట్ గా వారం రోజుల గ్యాప్ తో రెండు సినిమాలతో వచ్చాడు యంగ్ హీరో రాజ్ తరుణ్.అందులో ఒకటి పురుషోత్తముడు కాగా మరొకటి తిరగబడరసామీ.అయితే ఈ రెండు ఓకే రిజల్ట్ ఇచ్చాయి.ఇక ఇప్పుడు రాజ్ తరుణ్, భలే ఉన్నాడే తో మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి వచ్చాడు.ట్రైలర్ ఎంటర్టైనింగ్ గా ఉండడం అలాగే మారుతి సమర్పపకుడిగా వ్యవహరించడ తో ఈసినిమాపై అంచనాలు మొదలయ్యాయి.మరి రోజే థియేటర్లోకి వచ్చిన ఈసినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.
కథ :
రాధా (రాజ్ తరుణ్) ఆడవాళ్లకు చీరలు కట్టే వృత్తి( శారీ డ్రెపర్) చేస్తూ రాముడు లాంటి గుణాలు కలిగిన తను అమ్మాయిలకు దూరంగా ఉంటాడు.తన తల్లి గౌరి (అభిరామి) బ్యాంక్ ఉద్యోగి.ఇక అదే బ్యాంక్ లో కృష్ణ (మనీషా)కొత్తగా ఉద్యోగంలోకి చేరుతుంది.ఓసారి గౌరీ లంచ్ బాక్స్ తిని రాధా వంటలకు కృష్ణ ఫిదా అవుతుంది.ఈక్రమంలో రాధాను చూసి మనసు పారేసుకుంటుంది.కృష్ణ పంపే ప్రేమ లేఖల వల్ల రాధాకు కూడా కృష్ణ నచ్చుతుంది.అంతా ఓకే అనుకుంటున్న తరుణంలో రాధా గురించి కృష్ణకి ఓ విషయం తెలుస్తుంది.దాంతో రాధా మీద అనుమానం మొదలువుతుంది.ఆ అనుమానం అసలు రాధా పెళ్లికి పనికి వస్తాడా లేదా అని.మరి ఆతరువాత వీరి కథ ఏమైంది ? రాధా అమ్మాయిలకు దూరంగా ఉండడానికి కారణం ఏంటి? చివరకి రాధా,కృష్ణ ఎలా కలిశారు అనేది మిగితా కథ.
విశ్లేషణ :
రాముడి లక్షణాలు వున్న అబ్బాయి,మోడ్రన్ అమ్మాయి ని ప్రేమిస్తే ఎలా ఉంటుంది అనే పాయింట్ తో స్టోరీ ని రాసుకున్నాడు దర్శకుడు.ఈతరానికి చెప్పాల్సిన స్టోరీనే ఇది.అయితే దాన్ని తెర మీద తెచ్చే ప్రయత్నంలో కొంచెం తడబడ్డాడు కానీ మొత్తానికి అయితే పర్వాలేదనిపించాడు.తల్లి కొడుకు అనుబంధం నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు అలాగే లంచ్ బాక్స్ తో హీరో, హీరోయిన్ ప్రేమాయణం ఇవ్వన్నీ ఫస్ట్ హాఫ్ లో టైం పాస్ చేయిస్తాయి.ఇక ఈప్రేమ డీప్ గా వెళ్ళాకా అక్కడి నుండి అసలు కథ స్టార్ట్ అవుతుంది.
ఇంటర్వెల్ ముందు వచ్చే సన్నివేశాలు సెకండ్ హాఫ్ పై ఆసక్తిని పెంచేస్తాయి.అయితే ద్వితీయార్ధంలో కొన్ని సీన్లు సహనాన్ని పరీక్షించినా సింగీతం శ్రీనివాస్ – లీలా శ్యామ్ సన్ ల ట్రాక్ సూపర్ అనిపిస్తుంది.ఇక హీరో హీరోయిన్ బ్రేక్ అప్ తరువాత వచ్చే సీన్లు ఎమోషనల్ గా ఉంటాయి.క్లైమ్యాక్స్ రొటీన్ గానే ముగుసినా ఓకే అనిపిస్తుంది.ఓవరాల్ గా భలే ఉన్నాడే ఓ మంచి టైం పాస్ ఎంటర్టైనర్.
నటీ నటుల విషయానికి వస్తే రాధా పాత్రకు రాజ్ తరుణ్ చక్కగా సరిపోయాడు.ఆ పాత్రలో తను చాలా సహజంగా కనిపించాడు.ఈమధ్య రాజ్ తరుణ్ నుండి వచ్చిన బెస్ట్ రోల్ ఇదే అని చెప్పొచ్చు.ఇక హీరోయిన్ పాత్రలో నటించిన మనీషా కూడా ఆకట్టుకుంది.రాజ్ తరుణ్ ,మనీషా మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది.అలాగే తల్లి పాత్రలో అభిరామి మెప్పించింది.తనకు మంచి పాత్ర దొరికింది.వీటివీ గణేశన్ ,హైపర్ ఆది, నెల్లూరు సుదర్శన్ కామెడీతో నవ్వించారు.
టెక్నికల్ గా కూడా సినిమా ఓకే అనిపిస్తుంది.సినిమాటోగ్రఫీ బాగుంది.విజువల్స్ రిచ్ గా అనిపిస్తాయి.ఎడిటింగ్ ఓకే.శేఖర్ చంద్ర సంగీతం సినిమాకు చాలా ప్లస్ అయ్యింది.పాటలు బాగున్నాయి.బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా నీట్ గా వుంది.ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా వున్నాయి.
ఓవరాల్ గా మారుతి ప్రోడక్ట్ అంటూ వచ్చిన ఈ భలే ఉన్నాడే భలే వుంది అనిపించే రేంజ్ లో లేదు కానీ ఓకే అనిపిస్తుంది.రాజ్ తరుణ్ నటన ,కథ ,సంగీతం ,ఫస్ట్ హఫ్ సినిమాలో హైలైట్ అయ్యాయి.ఈసినిమాను యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఓసారి చూసేయొచ్చు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























