నా కెరీర్‌లో మోస్ట్ శాటిస్ఫైయింగ్ ఫిల్మ్ ఇది

Nava Dhalapathy Sudheer Babu Thanks To Maa Nanna Superhero Team

నవ దళపతి సుధీర్ బాబు హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ‘మా నాన్న సూపర్ హీరో’తో అలరించబోతున్నారు. అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వంలో CAM ఎంటర్‌టైన్‌మెంట్, V సెల్యులాయిడ్స్ బ్యానర్‌పై సునీల్ బలుసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆర్ణ హీరోయిన్ గా నటించగా.. సాయి చంద్, సాయాజీ షిండే, రాజు సుందరం, శశాంక్, ఆమని, అన్నీ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అక్టోబర్ 11న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా నేచురల్ స్టార్ నాని ఈ సినిమా టీజర్‌ను లాంచ్ చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ టీజర్ లాంచ్ ఈవెంట్ లో హీరో సుధీర్ బాబు చిత్ర విశేషాలు పంచుకున్నారు. నవ దళపతి ఏమన్నారో ఆయన మాటల్లోనే.. “అందరికీ నమస్కారం. సుధీర్ బాబు సన్ అఫ్ పోసాని నాగేశ్వరరావు. మాకు గొప్ప జీవితాన్ని ఇవ్వడానికి నాన్న అహర్నిశలు కష్టపడేవారు. నాకు ఈ లైఫ్ ఇచ్చిన నాన్నకి ఈ సందర్భంగా థాంక్స్ చెప్పుకుంటున్నాను. నాన్న గురించి ఎంత చెప్పినా సరిపోదు. టీజర్ చూస్తే ఈ సినిమా థీం అందరికీ అర్ధమైవుంటుంది. ఇది మార్వల్ సూపర్ హీరో సినిమా కాదు. కానీ ఆ సినిమాల్లో హీరోలకి వుండే సూపర్ పవర్ ఈ సినిమాలో వుంది. ఆ పవర్ పేరు ప్రేమ.”

“ఇద్దరు సూపర్ హీరోల మధ్య జరిగే లవ్ స్టొరీ ఇది. కథ విన్నప్పపుడు ఎంత ఇష్టపడ్డానో, చేసినప్పుడు అంతే ఇష్టంగా చేశాను. మీరు చూసినపుడు కూడా అంతే ఇష్టంగా ఈ సినిమా చూస్తారనే నమ్మకం వుంది. మనందరికీ కనెక్ట్ అయ్యే ఎమోషన్ ‘నాన్న’. నాకు హార్ట్ ఫుల్ గా నచ్చిన సినిమా ఇది. నా కెరీర్ మోస్ట్ సాటిస్ఫైయింగ్ ఫిలిం ఇది. మీ ఫ్యామిలీ అందరితో వెళ్తే చాలా ఎంజాయ్ చేస్తారు. డైరెక్టర్ అభిలాష్ తో వర్క్ చేయడం చాలా ఎంజాయ్ చేశాను. తన ట్యాలెంట్ ని అక్టోబర్ 11న ఆడియన్స్ విట్నెస్ చేస్తారు.”

“నిర్మాతలు వంశీ, సునీల్ నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్స్. మేమంతా కలసి సినిమాలని డిస్ట్రిబ్యూషన్ చేసేవాళ్ళం. వారి బ్యానర్ లో నేను హీరోగా చేయడం డ్రీం ఫర్ మీ. ఇందులో కొత్త సాయాజీ షిండేని చూస్తారు. ఇప్పటివరకూ ఇలాంటి పాత్ర చేయలేదు. సాయి చంద్ గారు టెర్రిఫిక్ గా చేశారు. చాలా మంచి రోల్ అది. ఆర్ణ చాలా హార్డ్ వర్క్ చేసింది. తనకి మంచి పేరు వస్తుంది. శశాంక్ చాలా యీజ్ తో నటించారు.”

“జై క్రిష్ మ్యూజిక్ అద్భుతంగా వుంటుంది. డీవోపీ సమీర్ గురించి ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. బ్యూటీఫుల్ విజువల్స్ ఇచ్చారు. టీం అందరికీ థాంక్ యూ. సోషల్ మీడియాలో టీజర్ ని లాంచ్ చేసిన నానికి థాంక్ యూ. టీజర్ తనకి చాలా నచ్చింది. ఇందులో నేను చేసిన క్యారక్టర్ ఎగ్జాక్ట్‌గా మా నాన్నగారే. చాలా ప్రేమతో చేసిన సినిమా ఇది. అక్టోబర్ 11న ఫ్యామిలీతో కలసి థియేటర్స్ కి వెళ్ళండి. చాలా ఎంజాయ్ చేస్తారు” అని అన్నారు హీరో సుధీర్ బాబు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.