తెలంగాణలో ఇటీవల కురిసిన ఎడతెరిపిలేని వర్షాల కారణంగా అనేక ప్రాంతాల్లో భారీ వరదలు ముంచెత్తిన విషయం తెలిసిందే. వీరిని ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సహాయక కార్యక్రమాలను చేపట్టింది. ఈ నేపథ్యంలో వరద బాధితుల సహాయార్థం పలువురు సినీ ప్రముఖులు భారీ విరాళాలను ప్రకటించారు. ఈ క్రమంలో తాజాగా బుధవారం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సీఎం రేవంత్ రెడ్డిని కలుసుకుని రూ.1 కోటి అందించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు మరియు సూర్యదేవర నాగవంశీ కూడా ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.25 లక్షలు చొప్పున అందించారు. ఈ భారీ విరాళానికి సంబంధించిన చెక్కులను వారు తాజాగా సీఎం రేవంత్ రెడ్డిని కలిసి అందించారు. అలాగే అక్కినేని కుటుంబం తరపున సుప్రియా యార్లగడ్డ కూడా రూ.1 కోటి అందించారు. ఇక ఈ సందర్భంగా వరద బాధితులను ఆదుకోవడంలో స్పందించి ప్రభుత్వానికి అండగా నిలిచినందుకు వీరిని ముఖ్యమంత్రి అభినందించారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























