ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చేసిన దేవర ట్రైలర్ నిన్న విడుదలైంది.ఇక ఈ ట్రైలర్ కు పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది.ట్రైలర్ లోనే ఆల్మోస్ట్ స్టోరీ ని రివీల్ చేశారు కానీ సినిమా చివర్లో వచ్చే ట్విస్ట్ అదిరిపోనుందట.ఎన్టీఆర్ డ్యూయెల్ రోల్ లో కనిపించడం,యాక్షన్ సీన్స్ ,లాస్ట్ షాట్ ,బీజీఎమ్… ట్రైలర్ ను నిలబెట్టాయి.ఈసినిమాను బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా దింపుతున్నారు.ఇక ఈట్రైలర్ యూట్యూబ్ లో దుమ్ము రేపుతోంది.పాన్ ఇండియా సినిమా కావడంతో తెలుగుతోపాటు మిగితా భాషల్లో కూడా రిలీజ్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
తెలుగు వెర్షన్ ట్రైలర్ 10మిలియన్లకు పైగా వ్యూస్ ను తెచ్చుకొని ట్రెండింగ్ లో కొనసాగుతుండగా సర్ప్రైజింగ్ గా మలయాళ వెర్షన్ ట్రైలర్ కూడా సూపర్ రెస్పాన్స్ వస్తుంది.తెలుగు,హిందీ తరువాత మళయాళ వెర్షన్ అత్యధిక వ్యూస్ ను సొంతం చేసుకుంది.ఇప్పటివరకు 3 మిలియన్లకు పైగా రాబట్టుకుంది.ఎన్టీఆర్ కి కేరళ లో మార్కెట్ లేదు కానీ ఈదేవర ట్రైలర్ కు వస్తున్న రెస్పాన్స్ తో అక్కడ మంచి వసూళ్లను దక్కించుకునే ఛాన్స్ వుంది.బడా డిస్ట్రిబ్యూషన్ సంస్థ దేవరను అక్కడ విడుదలచేయడం కూడా కలిసి రానుంది.
కొరటాల శివ డైరెక్షన్ లో వస్తున్న ఈసినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించగా సైఫ్ అలీ ఖాన్ పవర్ ఫుల్ విలన్ పాత్రలో కనిపించనున్నాడు.యువసుధ ఆర్ట్స్,ఎన్టీఆర్ ఆర్ట్స్ నిర్మిస్తున్నాయి.సెప్టెంబర్ 27న దేవర ఫస్ట్ పార్ట్ థియేటర్లలోకి రానుంది.ఏ మాత్రం హిట్ టాక్ వచ్చినా దేవర రచ్చ చేయడం ఖాయం.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: