100 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న అడివి శేష్ G2

Adivi Sesh's Spy Thriller G2 Set To With Massive Budget of 100 Crores

ట్యాలెంటెడ్ హీరో అడివి శేష్ కథానాయకుడిగా నటించిన సెన్సేషనల్ స్పై థ్రిల్లర్ ‘గూఢచారి’ 6 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా తన లేటెస్ట్ మూవీ ‘G2’ నుంచి స్టన్నింగ్ మూమెంట్స్‌తో ఫ్యాన్స్‌ని థ్రిల్ చేశారు. కాగా ఇది గూఢచారికి సీక్వెల్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. వినయ్ కుమార్ సిరిగినీడి దర్శకత్వం వహిస్తున్న G2లో బనితా సంధు హీరోయిన్‌గా నటిస్తోంది. డైరెక్టర్ వినయ్‌ కుమార్‌తో కలిసి శేష్‌ రైటర్‌గా వ్యవహరిస్తుండటం గమనార్హం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక గూఢచారి 6 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా ఇటీవలే ‘G2’ నుంచి స్టన్నింగ్ మూమెంట్స్‌తో ఫ్యాన్స్‌ని థ్రిల్ చేశారు. ఇప్పటికే 40% షూటింగ్ పూర్తి కావడంతో, మేకర్స్ ప్రధానపాత్రలకు సంబంధించిన ఆరు స్టైలిష్ స్టిల్స్‌ను విడుదల చేశారు. ఈ స్టిల్స్ సినిమాపై అంచనాలను మరింతగా పెంచేశాయనడంలో సందేహం లేదు. ఇదిలావుంటే తాజాగా G2 సినిమాకి సంబంధించి ఓ సాలిడ్ న్యూస్ వినిపిస్తోంది.

ఇంటర్‌నేషనల్ స్కేల్‌లో నిర్మితమవుతోన్న ఈ మూవీన్నీ నిర్మాతలు భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తోన్నట్టు తెలుస్తోంది. దాదాపు 100 కోట్లతో ఈ చిత్రం రూపొందుతోన్నట్టు సమాచారం. కాగా అడివి శేష్ గత సినిమా ‘మేజర్’ పాన్ ఇండియా లెవెల్లో సూపర్ హిట్ అయిన నేపథ్యంలో.. మేకర్స్ దీనిని బిగ్ స్కేల్‌పై నిర్మిస్తున్నట్టు ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి. ‘కార్తికేయ 2’ వంటి పాన్ ఇండియా మూవీని నిర్మించిన చిత్రబృందం ఇప్పుడు G2ని నిర్మిస్తుండటంతో సినిమాపై అంచనాలు వేరే లెవెల్లో ఉన్నాయి.

కాగా జి2లో బాలీవుడ్ స్టార్ యాక్టర్ ఇమ్రాన్ హష్మీ కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. స్టైలిష్ విలన్‌గా ఆయన కనిపించనున్నారు. 2018లో వచ్చిన గూఢచారి చిత్రానికి హై-ఆక్టేన్ యాక్షన్ సీక్వెల్‌గా ఆరేళ్ల తర్వాత మళ్లీ సెల్యులాయిడ్‌లోకి వస్తోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై టిజి విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ కలిసి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాగా ఈ సినిమాను వచ్చే యేడాది పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేయనున్నట్టు మేకర్స్ తాజాగా ప్రకటించారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.