యంగ్ హీరో రాజ్ తరుణ్ అప్‌కమింగ్ మూవీ ‘భలే ఉన్నాడే’. సింగీతం శ్రీనివాస్, అభిరామి, అమ్ము అభిరామి, లీలా శాంసన్, వీటీవీ గణేష్, హైపర్ ఆది, కృష్ణ భగవాన్, గోపరాజు రమణ, శ్రీకాంత్ అయ్యంగార్, రాచా రవి, సుదర్శన్, శ్రీనివాస్ వడ్లమాని, మణి చందన, పటాస్ ప్రవీణ్ తదితరులు ముఖ్య తారాగణం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇప్పటికే విడుదలైన ఈ టీజర్, ట్రైలర్, సాంగ్స్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. రవికిరణ్ ఆర్ట్స్ బ్యానర్‌పై ఎన్వి కిరణ్ కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి జె శివసాయి వర్ధన్ డైరెక్టర్. బ్లాక్ బస్టర్ మేకర్ మారుతి ఈ చిత్రాన్ని ప్రజెంట్ చేస్తున్నారు. వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 7న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.
ఈ నేపధ్యంలో మేకర్స్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్లో హీరో రాజ్ తరుణ్ మాట్లాడుతూ.. “అందరికీ నమస్కారం. నేను వర్క్ చేసిన డైరెక్టర్స్‌లో శివసాయి వన్ అఫ్ ది బెస్ట్ డైరెక్టర్. తన కన్విక్షన్, సినిమాని చేసే విధానం అద్భుతంగా వుంది. నాకు డైరెక్టర్ అవ్వాలని వుందని ఎప్పుడూ చెబుతుంటాను. ఆయన డైరెక్ట్ చేసిన విధానం చూసిన తర్వాత నేను ఇంకా నేర్చుకోవాల్సింది చాలా వుందని అర్ధమైంది. కిరణ్ గారు చాలా సపోర్ట్ చేశారు. డైరెక్టర్ విజన్‌కి తగ్గట్టు ప్రతిది సమకూర్చారు” అని అన్నారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ.. “మనీషా చక్కగా పెర్ఫార్మ్ చేసింది. తెలుగు నేర్చుకొని డబ్బింగ్ చెప్పింది. శేఖర్ చంద్రతో ఇది నా మూడో సినిమా. బ్యూటీఫుల్ మ్యూజిక్ ఇచ్చారు. మారుతి గారితో ఎప్పటినుంచో సినిమా చేయాలని వుండేది. ఈ సినిమాతో కుదిరినందుకు చాలా హ్యాపీగా వుంది. సెప్టెంబర్ 7న సినిమా థియేటర్స్‌లో రిలీజౌతుంది. ఇది ప్రోపర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఫ్యామిలీ అంతా కలసి చూసేలా తీశాం. బ్యూటీఫుల్ ఎంటర్టైనర్, చాలా మంచి ఎమోషన్స్ వుంటాయి. తప్పకుండా థియేటర్స్‌లో సినిమా చూడండి” అని అన్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























