సుహాస్ గొర్రె పురాణం నుండి సెకండ్ సింగిల్ రిలీజ్

Gorre Puranam Second Single Bhale Bhale Lyrical Video Released

టాలీవుడ్ ట్యాలెంటెడ్ అండ్ వెర్సటైల్‌ యాక్టర్‌ సుహాస్ తన గత చిత్రాలు అంబాబీపేట మ్యారేజీ బ్యాండు, ప్రసన్న వదనం లతో ప్రేక్షకులను అలరించాడు. తాజాగా ఆయన వరుస సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం సుహాస్ హీరోగా ‘జనక అయితే గనక’ మరియు ‘గొర్రె పురాణం’ చిత్రాలలో నటిస్తున్నాడు. వీటిలో సందీప్‌ రెడ్డి బండ్ల దర్శకత్వంలో దిల్ రాజు ప్రొడక్షన్స్ నిర్మించిన జనక అయితే గనక సెప్టెంబర్‌ 7న గ్రాండ్‌గా విడుదల కానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక మరో సినిమా గొర్రె పురాణం ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం టైటిల్ తోనే ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన టీజర్, ఫస్ట్ సింగిల్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో మేకర్స్ ప్రమోషన్ కార్యక్రమాలలో వేగం పెంచుతున్నారు. దీనిలో భాగంగా సినిమాకి సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్‌డేట్స్ అందిస్తున్నారు.

ఈ క్రమంలో తాజాగా గొర్రె పురాణం నుంచి సెకండ్ సింగిల్ రిలీజ్ చేశారు. ‘భలే భలే’ అంటూ సాగే ఈ లిరికల్ వీడియో మూవీ లవర్స్‌ను ఆకట్టుకుంటోంది. చైతన్య ప్రసాద్ సాహిత్యం అందించిన ఈ పాటకు పవన్ సిహెచ్ సంగీతం సమకూర్చారు. శిరీషా భాగవతుల, సార్థక్ కళ్యాణి ఆలపించారు. ఇక ఈ వీడియోలో సాంగ్ మేకింగ్‌ను కూడా చూపించారు. కాగా త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.