కంటెంట్ ఉంటే చాలు స్టార్ కాస్టింగ్ అవసరం లేదని మరోసారి నిరూపించింది కమిటీ కురోళ్ళు.చిన్న సినిమాగా వచ్చిన ఈచిత్రం మౌత్ టాక్ తో రోజు రోజుకి కలెక్షన్స్ ను పెంచుకుంటూ బ్లాక్ బాస్టర్ అనిపించుకుంది.నిన్నటి తో ఈసినిమా రెండు వారాల రన్ ను పూర్తి చేసుకుంది.ఇక రెండు వారాలకు గాను ప్రపంచ వ్యాప్తంగా 15.6కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టుకుంది.బ్రేక్ ఈవెన్ టార్గెట్ చిన్నది కావడం తో బయ్యర్లకు మంచి లాభాలను తీసుకొస్తుంది.ఇప్పుడు మూడో వారం లోకి ఎంట్రీ ఇచ్చిన ఈసినిమాకు థియేటర్ల సంఖ్య కూడా పెరిగింది. వచ్చే వారం వరకు పెద్ద సినిమా రిలీజ్ లేకపోవడంతో మంచి వసూళ్లను దక్కించుకోనుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా ఓటిటి రైట్స్ ను ఆహా దక్కించుకుందని టాక్.అయితే ఈవిషయంలో అఫీషియల్ అనౌన్స్ మెంట్ రావాల్సివుంది. అయితే ఇప్పుడప్పుడే ఈసినిమా ఓటిటి లోకి వచ్చే ఛాన్స్ లేదట.థియేటర్లలో రెస్పాన్స్ బాగుండడం తో ఒక నెల అయినా గ్యాప్ ఇవ్వాలనుకుంటున్నారు నిర్మాతలురీసెంట్ గా ఈసినిమాను చూసి మెగాస్టార్ చిరంజీవి కమిటీ కురోళ్ళ టీంను అభినందించారు.
రూరల్ బ్యాక్ డ్రాప్ లో వంశీ యదు డైరెక్ట్ చేసిన ఈసినిమాలో సందీప్ సరోజ్,యశ్వంత్ పెండ్యాల,ఈశ్వర్ రచిరాజు ,ప్రసాద్ బెహ్రా ,టీనా శ్రావ్య,తేజస్వి రావు కీలక పాత్రల్లో నటించగా అనుదీప్ దేవ్ సంగీతం అందించాడు.కొణిదెల నిహారిక ఈసినిమాను నిర్మించింది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























