యంగ్ హీరో కిరణ్ అబ్బవరం,హీరోయిన్ రహస్య గోరక్ ల వివాహం గురువారం రాత్రి కర్ణాటకలోని కూర్గ్ లో ఘనంగా జరిగింది.కూర్గ్ లోని ఓ రిసార్ట్ లో కుటుంబ సభ్యులు,సన్నిహితులైన మిత్రుల సమక్షంలో వీరి వివాహ వేడుకలు జరిగాయి.ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు,వీడియోలు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి.సినీ ప్రియులు,చిత్ర పరిశ్రమకు చెందిన మిత్రులు ఈ కొత్త జంటకు శుభాకాంక్షలు చెబుతూ పోస్ట్ లు చేస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక కిరణ్ అబ్బవరం-రహస్య కలిసి రాజావారు రాణిగారు సినిమాలో నటించారు.ఆ సినిమా చిత్రీకరణ సమయంలోనే ఇద్దరు ఒకరిని ఒకరు ఇష్టపడ్డారు.ఈసినిమా సూపర్ హిట్ అయ్యింది.ప్రస్తుతం కిరణ్ అబ్బవరం భారీ పీరియాడిక్ థ్రిల్లర్ మూవీ క లో నటిస్తున్నాడు.రీసెంట్ గా ఈసినిమానుండి వచ్చిన టీజర్, సాంగ్ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకున్నాయి.దాంతో ఈసినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి.
షూటింగ్ కూడా తుది దశకు చేరుకుంది.ఈసినిమాలో కిరణ్ పోస్ట్ మ్యాన్ గా కనిపించనున్నాడు.సుజిత్ -సందీప్ డైరెక్ట్ చేస్తున్న ఈచిత్రానికి సామ్ సీఎస్ సంగీతం అందిస్తున్నాడు.సునీల్ నందిపాటి,క రిలీజ్ హక్కులను దక్కించుకున్నాడు. పాన్ ఇండియా మూవీ గా విడుదలకానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























