ఐఫా ఉత్సవం.. నామినేషన్స్‌లో పలువురు మాలీవుడ్ స్టార్స్

IIFA Utsavam Awards 2024 Nominations From Mollywood

ఇండియన్ సౌత్ ఫిల్మ్ అవార్డులకు సంబంధించిన ప్రతిష్టాత్మక వేదిక ‘ఐఫా ఉత్సవం’ (IIFA) వేడుకలకు రంగం సిద్ధమవుతోంది. ఈ యేడాది తెలుగు, తమిళం, కన్నడ మరియు మలయాళం పరిశ్రమలకు చెందిన అత్యుత్తమ చిత్రాలకు అవార్డు ప్రెజెంటేషన్‌లు అందించనుంది. ఇక వేడుకల్లో భాగంగా సాంస్కృతిక ప్రదర్శనలతో కూడిన గ్రాండ్ గాలా కోసం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌ (యూఏఈ) దేశం సిద్ధమవుతోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ ఈవెంట్‌కి అబుదాబిలోని యాస్ ఐలాండ్‌లో గల ప్రతిష్టాత్మక ఎతిహాద్ ఎరీనా ఇండోర్ స్టేడియం ఆతిథ్యమిస్తుండగా.. సెప్టెంబర్ 27వ (శుక్రవారం) తేదీన గ్రాండ్ గా జరుగనుంది. అందులో భాగంగా తెలుగు, కన్నడ, తమిళం మరియు మలయాళం భాషలకు సంబంధించి అవార్డులు ప్రకటించనున్నారు. విజేతలకు ప్రముఖుల చేతులమీదుగా అవార్డులు ప్రదానం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి స్టార్ హీరో రానా దగ్గుబాటి హోస్ట్ గా వ్యవహరించనున్నారు.

ఇక ఈ సంరంభం కోసం దేశవ్యాప్తంగా వివిధ చిత్ర పరిశ్రమల నుండి అగ్ర తారలు, ఫిల్మ్ మేకర్స్ విచ్చేయనున్నారు. కాగా 2024 ఐఫా అవార్డుల కోసం నామినేషన్స్ ఓపెన్ అయ్యాయి. దీనిలో భాగంగా సౌత్ లోని అన్ని భాషల నుంచి ఈ నామినేషన్స్ పూర్తయ్యాయి. మాలీవుడ్ (మలయాళం) నుంచి కొన్ని చిత్రాలు, నటీనటులు, సాంకేతిక నిపుణులు వివిధ కేటగిరీల్లో నామినేషన్స్ దక్కించుకున్నాయి. అవేంటో ఇక్కడ చూద్దాం..

ఐఫా ఉత్సవం.. మాలీవుడ్ నామినేషన్స్‌ వివరాలు

ఉత్తమ చిత్రం

  • రోమంచమ్
  • ఫ్యామిలీ
  • నెరు
  • కన్నూరు స్క్వాడ్
  • 2018: అందరూ హీరోలే

ఉత్తమ దర్శకుడు

  • జిత్తు మాధవన్ – రోమంచమ్
  • దేవన్ జయకుమార్ – వాలట్టి
  • జూడ్ ఆంథనీ జోసెఫ్ – 2018: అందరూ హీరోలే
  • లిజో జోస్ పెల్లిస్సేరి – నాన్‌ప‌క‌ల్ నేర‌త్తు మ‌య‌క్కం
  • జియో బేబీ – కాథల్ – ది కోర్

ఉత్తమ నటుడు

  • మోహన్‌లాల్ – నెరు
  • ఫహద్ ఫాసిల్ – పచ్చువుమ్ అద్బుత విళక్కుమ్
  • మమ్ముట్టి – కాథల్ – ది కోర్
  • మమ్ముట్టి – నన్‌పకల్ నేరతు మయక్కమ్
  • టోవినో థామస్ – 2018: అందరూ హీరోలే
  • జోజు జార్జ్ – ఇరట్టా

ఉత్తమ నటి

  • మంజు పిళ్లై – ఫాలిమి
  • జ్యోతిక – కాథల్ – ది కోర్
  • విన్సీ అలోషియస్ – పద్మిని
  • కళ్యాణి ప్రియదర్శన్ – శేషమ్ మైక్-ఇల్ ఫాతిమా
  • అనశ్వర రాజన్ – నెరు

ఉత్తమ సహాయ నటుడు

  • ఇంద్రజిత్ సుకుమారన్ – తురముఖం
  • లాల్ – 2018: అందరూ హీరోలే
  • సిద్ధిక్ – నెరు
  • నారాయణ్ – 2018: అందరూ హీరోలే
  • సుధీ కోళికోడ్ – కథల్ – ది కోర్

ఉత్తమ సహాయ నటి

  • నిఖిలా విమల్ – అయల్వాశి
  • మమిత బైజు – ప్రణయ విలాసం
  • బిందు పనికర్ – మధుర మనోహర మొహం
  • దర్శన రాజేంద్రన్ – తురముఖం
  • స్రింద – ఇరట్టా

ఉత్తమ విలన్

  • బిజు మీనన్ – గరుడన్
  • రోషన్ మాథ్యూ – ధూమమ్
  • సన్నీ వేన్ – వేలా
  • సుదేవ్ నాయర్ – తురముఖం
  • అర్జున్ రాధాకృష్ణన్ – కన్నూరు స్క్వాడ్

ఉత్తమ సంగీత దర్శకత్వం

  • విష్ణు విజయ్, దబ్జీ – సులైఖా మంజిల్
  • నోబిన్ పాల్ -2018: అందరూ హీరోలే
  • సుషీన్ శ్యామ్ – కన్నూరు స్క్వాడ్
  • విష్ణు విజయ్ – ఫాలిమి
  • సుశీన్ శ్యామ్ – రోమంచమ్

ఉత్తమ సాహిత్యం

  • బి.కె హరినారాయణన్ – (పాట: అరికే కూట్టాయ్ – చిత్రం: వాలట్టి)
  • జో పాల్ – (పాట: వెన్మేఘం మెల్లె – చిత్రం: 2018: అందరూ హీరోలే)
  • వినాయక్ శశికుమార్ – (పాట: మృదు భావే ధృడ క్రుత్యే – చిత్రం: కన్నూర్ స్క్వాడ్)
  • జో పాల్ – (పాట: ఉయిరాయి మారవే – చిత్రం: 2018: అందరూ హీరోలే)
  • ముహ్సిన్ పరారీ – (పాట: మజావిల్లిలే – చిత్రం: ఫాలిమి)

ఉత్తమ నేపథ్య గాయకుడు

  • K. S. హరిశంకర్ – (పాట: వెన్మేఘం మెల్లె – చిత్రం: 2018: అందరూ హీరోలే)
  • K. S. హరిశంకర్ – (పాట: ఉయిరాయి మారవే – చిత్రం: 2018: అందరూ హీరోలే)
  • విజయ్ యేసుదాస్ – (పాట: నిరముల్లోరు – చిత్రం: వాలట్టి)
  • విష్ణు విజయ్ – (పాట: మజావిల్లిలే – చిత్రం: ఫాలిమి)
  • సుశీన్ శ్యామ్ – (పాట: ఆత్మవే పూ – చిత్రం: రోమంచమ్)

ఉత్తమ నేపథ్య గాయని

  • మధువంతి నారాయణన్ – (పాట: ఆధారంజలి – చిత్రం: రోమంచమ్)
  • కె.ఎస్. చిత్ర – (పాట: పొట్టితకర్న్న – చిత్రం: నీలవెలిచం)
  • శ్రేయా ఘోషల్ (పాట: ఆయిషా ఖల్బు నీ – చిత్రం: ఆయిషా)
  • ఎజ్మా నోబిన్ – (పాట: ఇన్నిథిలే – చిత్రం: 2018: అందరూ హీరోలే)
  • కె.ఎస్. చిత్ర – (పాట: అలివోజుకుమ్ – చిత్రం: ఆంటోని)
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.