క నుండి ఫస్ట్ సింగిల్ వరల్డ్ ఆఫ్ వాసుదేవ్ రిలీజ్

kiran abbavarm first single world of vasudev song image

యంగ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న భారీ పీరియాడిక్ థ్రిల్లర్ సినిమా “క”. ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ‘వరల్డ్ ఆఫ్ వాసుదేవ్..’ ను ఈ రోజు రిలీజ్ చేశారు. ఈ పాట హీరో కిరణ్ అబ్బవరం వాసుదేవ్ క్యారెక్టరైజేషన్ ను ఆవిష్కరించింది. ‘వరల్డ్ ఆఫ్ వాసుదేవ్..’ పాటకు సనాపతి భరద్వాజ పాత్రుడు లిరిక్స్ రాయగా..సామ్ సీఎస్ బ్యూటిఫుల్ గా కంపోజ్ చేశారు. కపిల్ కపిలన్ ఆకట్టుకునేలా పాడారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

‘వరల్డ్ ఆఫ్ వాసుదేవ్..’ పాట ఎలా ఉందో చూస్తే – ‘ఏ మొదలు తుదలు లేని ప్రయాణం. ఏ అలుపూ సొలుపు లేని విహారం. ఏ చెరలు తెరలు తెలియని పాదం..ఈ మజిలీ ఒడిలో ఒదిగిన వైనం,నిన్న మొన్న ఉన్న నన్ను చూశారా..వెన్ను దన్ను అంటూ ఏముంది. ఒంటరివాడినని అంటారా నాతో పాటు ఊరుంది…’ అంటూ హీరో వాసుదేవ్ పాత్రను ప్రతిబింబిస్తూ ‘వరల్డ్ ఆఫ్ వాసుదేవ్..’ పాట సాగుతుంది.

“క” సినిమాలో నయన్ సారిక, తన్వీ రామ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. శ్రీమతి చింతా వరలక్ష్మి సమర్పణలో శ్రీచక్రాస్ ఎంటర్ టైన్ మెంట్స్ తో బ్యానర్ పై చింతా గోపాలకృష్ణ రెడ్డి భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో నిర్మిస్తున్నారు. దర్శక ద్వయం సుజీత్, సందీప్ విలేజ్ బ్యాక్ డ్రాప్ యాక్షన్ థ్రిల్లర్ కథతో ‌”క” సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమా త్వరలో తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకురాబోతున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.