మెగా డాటర్ నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై రూపొందిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’. సీనియర్ నటీనటులతో పాటు 11 మంది హీరోలు, నలుగురు హీరోయిన్స్‌ను పరిచయం చేస్తూ ఈ చిత్రానికి యదు వంశీ దర్శకత్వం వహించారు.ఆగస్ట్ 9న ఈ చిత్రం విడుదల అవ్వగా. డిఫరెంట్ కంటెంట్‌తో అన్ని వర్గాల వారిని ఆకట్టుకుని వసూళ్లను రాబడుతోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రేక్షకుల ప్రశంసలతో పాటు విమర్శకుల ప్రశసంలను అందుకున్న ఈ సినిమాకు సెలబ్రిటీల నుంచి ప్రశంసలు దక్కుతున్నాయి. ఇప్పటికే సూపర్‌స్టార్ మహేష్ బాబు, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి, స్టార్ డైరెక్టర్ సుకుమార్, క్రిష్, దేవిశ్రీప్రసాద్ ఇలా చాలా మంది కమిటీ కుర్రోళ్ళు టీమ్‌ను అభినందించారు.
ఈ క్రమంలో తాజాగా మెగాస్టార్ చిరంజీవి ‘కమిటీ కుర్రోళ్ళు’ సినిమాను ప్రత్యేకంగా వీక్షించి ఎంటైర్ టీమ్‌ను ప్రత్యేకంగా కలుసుకున్నారు. నిర్మాత నిహారిక కొణిదెల, దర్శకుడు యదువంశీతో పాటు చిత్రంలోని నటీనటులందరూ చిరంజీవిని కలుసుకున్నారు. వారందరితో చిరంజీవి ప్రత్యేకంగా ముచ్చటిస్తూ సక్సెస్‌లో భాగమైన ప్రతీ ఒక్కరిని ఆయన అభినందించారు.
ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. “మా నిహారిక నిర్మించిన ‘‘కమిటీ కుర్రోళ్ళు’ సినిమాను చూశాను. చాలా చక్కగా ఉంది. అందరూ కొత్త కుర్రాళ్లే. చాలా బాగా చేశారు. సినిమా చూస్తున్నప్పుడు కొత్తవాళ్లు యాక్ట్ చేస్తున్నారనే విషయాన్ని మరచిపోయాను. ఎమోషనల్ సీన్స్ చాలా చక్కగా పండాయి. నటీనటులందరూ కథానుగుణంగా మేకోవర్ అయిన తీరు అద్భుతం. సినిమాను నేచురల్‌గా చిత్రీకరించటం ఎంటైర్ టీమ్ పడ్డ కష్టం గురించి ఎంత చెప్పినా తక్కువే, అది తెరపై కనిపించింది” అని పేర్కొన్నారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ.. “రీజనబుల్ బడ్జెట్‌లో సినిమాను తెరకెక్కించిన దర్శకుడు యదు వంశీకి ప్రత్యేకమైన అభినందనలు. దర్శకుడిగా తను చక్కటి ప్లానింగ్‌తో సినిమాలోని ప్రతీ సన్నివేశాన్నిముందుగా డిజైన్ చేసుకోవటం వల్ల బాగా తెరకెక్కించగలిగారు. రీసెంట్‌గా విడుదలైన సినిమాల్లో కమిటీ కుర్రోళ్లు ముందంజలో ఉంటూ మంచి వసూళ్లను రాబడుతుంది. ఎంటైర్ టీమ్‌కు అభినందనలు’’ అని అన్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























