రిచర్డ్ మేడెన్, ప్రియాంక చోప్రా ప్రధాన పాత్రల్లో హాలీవుడ్ లో సిటాడెల్ అనే వెబ్ సిరీస్ వచ్చిన సంగతి తెలిసిందే కదా. ఇదే వెబ్ సిరీస్ ను ఇండియన్ వెర్షన్ లో కూడా తెరకెక్కిస్తున్న సంగతి కూడా విదితమే. రాజ్ అండ్ డీ దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ సమంత, బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ ప్రధాన పాత్రల్లో ఈ వెబ్ సిరీస్ వస్తుంది. సిటాడెల్ హనీ బన్నీ అనే టైటిల్ తో ఈ వెబ్ సిరీస్ వస్తుంది. ఇక ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సిరీస్ ప్రస్తుతం పోస్ట్ ప్రోడక్షన్ పనుల్లో బిజీగా ఉంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా ఆగష్ట్ 1వ తేదీన ఈ వెబ్ సిరీస్ నుండి ఒక సర్ ప్రైజింగ్ అప్ డేట్ ఇవ్వనున్నట్టు ఇప్పటికే అప్ డేట్ ఇచ్చారు. ఈనేపథ్యంలోనే తాజాగా ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేశారు. బాలీవుడ్ క్లాసిక్ మూవీ నమక్ హలాల్ సినిమాలోని రాత్ బాకీ బాత్ బాకీ అనే పాటతో ఈ టీజర్‌ను కట్ చేశారు మేకర్స్. ఫుల్ యాక్షన్ ప్యాకడ్‌గా సాగిన ఈ టీజర్ అయితే ఆకట్టుకుంటుంది. ఇక టీజర్‌లో వరుణ్ ధావన్‌తో పాటు సమంత కొత్తగా కనిపిస్తుంది. అంతేకాదు ఈ సిరీస్ స్ట్రీమింగ్ డేట్ ను కూడా ప్రకటించారు. నవంబరు 7వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కు రానుంది.
ఇంకా ఈ వెబ్ సిరీస్ లో కేకే మీనన్, సిమ్రన్, సోహం మజుందార్, శివంకిత్ పరిహార్, కశ్వీ మజుందార్, సాఖిబ్ సలీం, సికిందర్ ఖేర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రాజ్ అండ్ డీకే డీటూఆర్ ఫిలింస్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























