కమెడియన్ గా సినీ కెరీర్ ను మొదలుపెట్టి ఇప్పుడు తనే హీరోగా సినిమాలు చేసే స్థాయికి చేరుకున్నాడు ప్రియదర్శి. ఇక రీసెంట్ తను హీరోగా వచ్చిన సినిమా డార్లింగ్. నభా నటేష్ హీరోయిన్ గా నటించిన ఈసినిమాకు అశ్విన్ రామ్ దర్శకత్వం వహించాడు. కామెడీ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈసినిమా ప్రమోషనల్ కంటెంట్ మంచి బజ్ నే క్రియేట్ చేసింది. ఇక ఎన్నో అంచనాల మధ్య ఈసినిమా జులై 19వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈసినిమా మంచి విజయాన్ని అందించలేకపోయింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పుడు ఈసినిమా ఓటీటీలోకి కూడా రాబోతుంది. ఈ సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన డీస్నీ ప్లస్ హాట్ స్టార్ ఈసినిమా ఓటీటీ హక్కులను సొంతం చేసుకుంది. ఈనేపథ్యంలో తాజాగా ఈసినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేస్తూ ప్రకటించారు. ఆగష్ట్ 13వ తేదీన ఈసినిమా ఓటీటీలోకి స్ట్రీమింగ్ కు రానుంది. మరి థియేటర్లలో చూడని వారు ఓటీటీ లో చూసి ఎంజాయ్ చేయండి.
కాగా ఈ సినిమాలో అనన్య నాగళ్ల, మురళీధర్ గౌడ్, శివ రెడ్డి, కృష్ణ తేజ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. చైతన్య రెడ్డి సమర్పణలో నిరంజన్ రెడ్డి ప్రైమ్ షో ఎంటర్ టైనమెంట్ బ్యానర్ పై చైతన్య రెడ్డి, నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు. సినిమాటోగ్రఫీ : నరేష్ రామదురై, సంగీతం : వివేక్ సాగర్, ఎడిటింగ్ : ప్రదీప్ ఇ.రాఘవ్ అందించారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























