పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘కల్కి 2898 AD’. క్రియేటివ్ ఫిల్మ్ మేకర్ నాగ్ అశ్విన్ గ్రాండ్ స్కేల్‌పై ఫ్యూచరిస్టిక్ ఎపిక్ మైథలాజికల్ డ్రామాగా తెరకెక్కించారు. ఇండియన్ లెజెండరీ యాక్టర్స్ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ కీలక పాత్రలు కనిపించగా.. బాలీవుడ్ బ్యూటీస్ దీపికా పదుకొణె, దిశా పటాని కథానాయికలుగా నటించారు. అలాగే మాళవిక నాయర్, బెంగాలీ నటుడు స్వాస్థ్ ఛటర్జీ, రాజేంద్రప్రసాద్, పశుపతి తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై స్టార్ ప్రొడ్యూసర్ అశ్వనీదత్ భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కల్కి చిత్రం జూన్ 27న వరల్డ్ వైడ్‍గా రిలీజ్ అయింది. విడుదలకు ముందే భారీ అంచనాలు నెలకొనగా.. అందుకు తగ్గట్లే బెనిఫిట్ షో నుంచే మ్యాసీవ్ రెస్పాన్స్ అందుకుంది. ఇక ఇప్పటికే 1,100 కోట్లకు పైగా వసూళ్లు సాధించి బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. అయితే కల్కి విడుదలై దాదాపు నెల కావొస్తున్నా.. ఇంకా థియేటర్లలో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతూ భారీ కలెక్షన్లతో దుమ్ము రేపుతుండటం విశేషం.
ఈ నేపథ్యంలో కల్కి మేకర్స్ ఓ కీలక ప్రకటన చేశారు. సినీ ప్రియులకు బంపర్ ఆఫర్ ప్రకటించారు. దేశవ్యాప్తంగా ఈ వారం అంతా రూ.100/- లకే కల్కి సినిమా టిక్కెట్స్ అందిస్తున్నట్టు తెలిపారు. ఈ మేరకు కల్కి టీమ్ సోషల్ మీడియా వేదికగా.. “థాంక్స్ అనేది ఒక చిన్న పదం.. ఎపిక్ మహా బ్లాక్‌బస్టర్ కల్కి 2898 ADని భారతదేశం అంతటా సినిమా థియేటర్లలో కేవలం రూ.100/-తో ఆస్వాదించండి. ఈ ఆఫర్ ఆగస్ట్ 2 నుండి ఒక వారం పాటు అందుబాటులో ఉంటుంది!” అని పేర్కొంది. సో, డార్లింగ్ ఫ్యాన్స్ అండ్ మూవీ లవర్స్ ఇంకెందుకు ఆలస్యం.. వెంటనే కల్కి టిక్కెట్స్ బుక్ చేసుకోండి, ఈ విజువల్ వండర్‌ని మరోసారి బిగ్ స్క్రీన్స్‌పై చూసి ఆస్వాదించండి.
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్‌ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























