మిస్టర్ బచ్చన్ నుండి జిక్కీ సాంగ్ ప్రోమో రిలీజ్

mr bachchan third single jikki song promo out now

మాస్ మహారాజా రవితేజ, మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో రాబోతున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ సినిమా మిస్టర్ బచ్చన్. ఈసినిమాపై మొదటినుండే భారీ అంచనలే ఉన్నాయి. ఇక ఆగష్ట్ 15వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో చిత్రయూనిట్ ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఇప్పటికే షోరీల్, టీజర్ కు అద్భుతమైన స్పందన వచ్చింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అంతేకాదు రెండు పాటలను కూడా రిలీజ్ చేశారు. రెండు పాటలు కూడా మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి. ఇప్పుడు మూడో పాటతో వచ్చేస్తున్నారు. జిక్కీ అంటూ వచ్చే రొమాంటిక్ సాంగ్‌ను రిలీజ్ చేయబోతున్నట్లుగా ఇప్పటికే మేకర్స్ అప్ డేట్ ఇచ్చిన సంగతి కూడా తెలిసిందే కదా. ఈ నేథ్యంలోనే తాజాగా ఈ సాంగ్ ప్రోమోను రిలీజ్ చేశారు. ప్రోమో అయితే ఆకట్టుకుంటుంది. ఈ పాటకు వనమాలి లిరిక్స్ అందించగా.. కార్తీక్, రమ్యా బెహరా ఆలపించారు. ఫుల్ సాంగ్ ను రేపు రిలీజ్ చేయనున్నారు.

కాగా భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తున్న ఈసినిమాలో ఇంకా జగపతి బాబు, సచిన్ ఖేడేకర్, వైవా హర్ష, నెల్లూరు సుదర్శన్, తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తుండగా, అయనంక బోస్ సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. ఈ చిత్రానికి అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్ కాగా, ఎడిటింగ్ ఉజ్వల్ కులకర్ణి.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.