సినిమా జయాపజయాలను పట్టించుకోకుండా వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంటూ సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు అశ్విన్ బాబు. ఎన్నో రోజుల నుండి వెయిట్ చేస్తున్న శివం భజే సినిమా ఫైనల్ గా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అప్సర్ దర్శకత్వంలో వచ్చిన ఈసినిమాలో అర్బాజ్ ఖాన్, దిగంగనా సూర్యవంశీ, హైపర్ ఆది, మురళీ శర్మ, తనికెళ్ళ భరణి, సాయి ధీన, బ్రహ్మాజీ, తులసి, దేవి ప్రసాద్, అయ్యప్ప శర్మ, శకలక శంకర్, కాశీవిశ్వనాధ్, ఇనాయ సుల్తాన తదితరులు కీలక పాత్రల్లో నటించారు. గంగ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై నిర్మించిన ఈసినిమాకు వికాస్ బడిస సంగీతం, దాశరథి శివేంద్ర సినిమాటోగ్రఫి అందించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ తో వచ్చేస్తున్నాడు. మామిడాల ఎం .ఆర్. కృష్ణ దర్శకత్వంలో అశ్విన్ బాబు తన తరువాత సినిమా చేయబోతున్నాడు. మెడికో థ్రిల్లర్ నేపథ్యంలో ఈసినిమా రాబోతుంది. ఇక నేడు అశ్విన్ బాబు పుట్టిన రోజు సందర్బంగా చిత్ర యూనిట్ అశ్విన్ బాబు కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేస్తూ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసింది. ఈ పోస్టర్ అదిరిపోయింది, సినిమాపై చాలా క్యురియాసిటీని పెంచింది.
మరోవైపు ఈసినిమా ఇప్పటికే షూటింగ్ ను మొదలుపెట్టినట్టు కూడా తెలుస్తుంది. ఈ చిత్రం హైదరాబాద్, వైజాగ్, కొడై కెనాల్ లో సగానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకున్నట్టు సమాచారం. వీలైనంత త్వరగా షూటింగ్ ను పూర్తిచేసి ఈ సంవత్సరం చివరిలో సినిమాను రిలీజ్ చేయాలన్న ప్లాన్ చేస్తున్నారట.
కాగా ఈసినిమాలో అశ్విన్ బాబు కి జోడిగా రియా సుమన్ నటిస్తుండగా అయేషా ఖాన్, మురళీ శర్మ, సచిన్ ఖేడేకర్, అజయ్, వీఐవీ గణేష్, యెష్నా చౌదరి, సుదర్శన్, శకలక శంకర్, రాఘవ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అరుణశ్రీ ఎంటర్టైన్మెంట్స్ ప్రొడక్షన్ నెంబర్ 3 గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని టి. గణపతి రెడ్డి నిర్మిస్తున్నారు. గౌర హరి మ్యూజిక్ అందిస్తుండగా, ఎం. ఎన్ బాల్ రెడ్డి డీవోపీ, విప్లవ్ నైషదం ఎడిటర్ గా పనిచేస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:
































